Home జనరల్ <em>శివనామ స్మరణతో మారుమోగిన సిద్ధులగుట్ట</em>
జనరల్

శివనామ స్మరణతో మారుమోగిన సిద్ధులగుట్ట

*మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి*

-శివరాత్రి జాగరణ ఉపవాస దీక్షల విరమణ

-పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం

-భక్తులతో కలిసి భోజనం చేసిన జీవన్ రెడ్డి

ఆర్మూర్, ఫిబ్రవరి19:- తెలంగాణ వార్త:
మహాశివరాత్రి సందర్భంగా ఆర్మూర్ లోని ప్రసిద్ద పుణ్యక్షేత్రమైన సిద్ధులగుట్ట
శివనామ స్మరణతో మారుమోగింది. శని,ఆది వారాలలో భక్తులు సిద్ధులగుట్ట కు పోటెత్తారు. పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి లింగాకార రూపుడైన శివునికి భక్తులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. జీవన్ రెడ్డి భక్తులతో కలిసి ఓం నమఃశివాయ, హరహర మహాదేవ శంభో శంకర అంటూ సిద్ధులగుట్ట పుణ్యక్షేత్రమంతా కలియతిరిగారు. ఓం నమః శివాయ అని జీవన్ రెడ్డి నినదిస్తుండగా శివ భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు.
సర్వ సృష్టికీ సంకేతంగా, స్థావర జంగమ సంగమ స్వరూపంగా, లింగమయ్యగా జంగమయ్యగా, శివునిగా, భవునిగా సాంబశివునిగా, అనునిత్యం కొలుచు కుంటున్న
పరమ శివుని పర్వదినాన సిద్ధులగుట్ట క్షేత్రం దేదీప్యమానంగా వెలుగుతూ భూలోక కైలాస శోభను సంతరించుకుంది. శ్రీకరం శుభకరం సకల మంగళకరంగా పార్వతీ పరమేశ్వరుల శుభాశీస్సుల కోసం భక్త జనకోటి మొక్కుకుంది. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో
మహాశివుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన భక్తులు
శివరాత్రి జాగరణ ఉపవాస దీక్షలను విరమించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులతో కలిసి భోజనం చేసిన జీవన్ రెడ్డి అడుగడుగునా ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులతో చర్చిస్తూ శివభక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకున్నారు.

ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు
ఛత్రపతి శివాజీ మహారాజ్ 393వ జయంతి వేడుకలను ఆదివారం ఆర్మూర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే జీవన్ రెడ్డి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి ఛత్రపతి శివాజీ మహారాజ్ దేశప్రజల దైవం మాత్రమే కాదని, స్ఫూర్తికి మూలమని అభివర్ణించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page