ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేట్ బస్సు..
తెలంగాణ వార్త: నిజామాబాద్, పెరికిట్, ఆర్మూర్
జాతీయ రహదారి 44లో ఆగి ఉన్న లారీని ప్రైవేట్ బస్సు శుక్రవారం ఢీ కొద్ది… ఆర్మూరు నియోజకవర్గంలో పెర్కిట్ వద్ద ఆగిఉన్న లారీని ప్రైవేట్ బస్సు ఢీ కొనడంతో బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి, ప్రమాదంలో గాయాలపాలైన వారిని జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ప్రైవేట్ బస్సు డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటంతో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఆర్మూర్ సీఐ సురేష్ బాబు తెలిపారు.
9012426055 9440023558
Leave a comment