కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలి
పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంచిన రవీందర్ యాదవ్
బతుకమ్మ, దసరా సందర్భంగా ఉచితంగా అంజేసినట్లు వెల్లడి
సేవా కార్యక్రమాల్లో ముందుంటున్న రవీందర్ యాదవ్
కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం.. కాంగ్రెస్ పాలనలో విధ్వంసం
బతుకమ్మ చీరలను ఇవ్వకపోవడంపై కాంగ్రెస్ ప్రభుత్వంను నిలదీత
రేవంత్ రెడ్డి పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నరు – రవీందర్ యాదవ్
హైదరాబాద్, తెలంగాణ వార్త:: సమాజం బాగుండాలని శ్రమించే పారిశుద్ధ్య కార్మికులు తెలంగాణ అతిపెద్ద పండుగ బతుకమ్మ, దసరాను సంతోషం జరుపుకోవాలని భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ అన్నారు. బతుకమ్మ పండుగ సందర్భంగా స్థానికంగా ఉన్న పలువురు పారిశుద్ధ్య మహిళా కార్మికులకు ఉచితంగా చీరలను అందజేశారు. హైదరాబాద్ ప్రజలు సంతోషంగా ఉంటున్నారంటే దాని వెనుక పారిశుద్ధ్య కార్మికుల కష్టం ఎంతో ఉందని కొనియాడారు. కార్మికులకు గత ప్రభుత్వ పాలనలో కేసీఆర్ అండగా నిలిచారన్నారు. వారికి ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు అందించి ఉన్నతంగా ఉంచే ప్రయత్నం చేశారని రవీందర్ యాదవ్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో కార్మికులే కాదు సకల జనులు ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. గెలువక ముందు ఓ మాట.. గెలిచాక మరో మాట అన్నట్లుగా కాంగ్రెస్ నేతల తీరు ఉందని ఎద్దేవా చేశారు. మూసీ పేరుతో ఎంతో మంది పేదల పొట్టగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భారాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో హైదరాబాద్ ను ప్రపంచ నగరంగా మారిస్తే .. నేడు కాంగ్రెస్ పార్టీ విధ్వంసం చేస్తూ అరాచకపాలనను కొనసాగిస్తుందన్నారు. ప్రతి ఏటా భారాస ప్రభుత్వం బతుకమ్మ చీరలను అందజేసిందన్నారు. మహిళలకు ప్రభుత్వం తరుపున చిన్న కానుకగా కేసీఆర్ ఇచ్చారన్నారు. పేద వర్గాల జీవితాల్లో పండుగ నాడు వెలుగులు నింపేలా కేసీఆర్ పాలన ఉండేదని గుర్తు చేసుకున్నారు. కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం సామాన్య ప్రజలను గాలికి వదిలేసిందని రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Leave a comment