డి పోచంపల్లి, తెలంగాణ వార్త:: డి. పోచంపల్లి లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ శ్యామల యాగానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత కూన శ్రీశైలం గౌడ్ గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా కూన శ్రీశైలం గౌడ్ గారు నియోజకవర్గ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, ఈ దేవి నవరాత్రి ఉత్సవాల సందర్బంగా రాజ శ్యామల యాగాన్ని నిర్వహించడం చాల సంతోషంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఎండి రాంబాబు, బుచ్చిరెడ్డి, కౌన్సిలర్ మహేందర్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment