Home జనరల్ TSPSC బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ పిలుపునిచ్చిన.. బీఎస్పీ సిద్దిపేట నాయకులు
జనరల్

TSPSC బోర్డు రద్దు చేయాలని ఛలో కలక్టరేట్ పిలుపునిచ్చిన.. బీఎస్పీ సిద్దిపేట నాయకులు

(తెలంగాణ వార్త) సిద్దిపేట్: టిఎస్పిఎస్సి బోర్డు రద్దు చేయాలని , చైర్మన్ జనార్దన్ రెడ్డిని విధుల నుంచి తొలగించాలని ,రద్దు చేసిన పరీక్షలు నిష్పక్షపాతంగా జరపాలని,ఈ కేసును సీబీఐ కి అప్పగించాలని,తెలంగాణ రాష్ట్రంలోని 36 లక్షల మంది నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఛలో కలెక్టరేట్ పిలుపునిచ్చిన బీఎస్పీ జిల్లా కమిటి నాయకులను పోలీసులు భారీగా మోహరించి అక్రమంగా అరెస్ట్ చేసి 2 టౌన్ పోలీస్ స్టేషన్ తరలించారు. స్టేట్ EC మెంబర్ లింగంపల్లి యాదగిరి, జిల్లా అధ్యక్షులు Er మోహన్ గారు, సిద్ధిపేట అసెంబ్లీ అధ్యక్షులు పుల్లూరు ఉమేష్ ,కోశాధికారి రోమాల బాబు గారు, జిల్లా కార్యదర్సులు కొండనోళ్ళ నరేష్ గారు,చిట్యాల శ్రీను , ఎనగందుల శంకర్ , కొర్రె సంజీవ్ జిల్లా మహిళ కన్వీనర్ పులి నీరజ గారు, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షులు గూడూరి కర్ణాకర్ గారు , దుబ్బాక అసెంబ్లీ అధ్యక్షులు జింక సంజీవులు గారు,హుస్నాబాద్ అసెంబ్లీ అధ్యక్షులు రాజు గారు,ఇతర అసెంబ్లీ ప్రధాన కార్యదర్సులు, మొండి కర్ణాకర్ ,సుజయ్ గారు, అసెంబ్లీ ,మండల,సెక్టార్ నాయకులను అరెస్టు చేసి పోలీసులు స్టేషన్ తరలించడం జరిగింది. ఇందులో పలువురు నాయకులకు గాయాలు అయ్యాయి. అరెస్టులతో మా పోరాటాన్ని ఆపలేరని TSPSC బోర్డు రద్దు చేసి ,తెలంగాణ నిరుద్యోగులకు న్యాయం చేసే వరకు పోరాటాన్ని మరింత ఉదృతంగా చేస్తామని , త్వరలో మంత్రి హరీష్ రావు పర్యటనను కూడా అడ్డుకుంటామని జిల్లా అధ్యక్షులు Er మోహన్ గారు హెచ్చరించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page