Home జనరల్ ధర్మపరిరక్షణే కేసీఆర్, జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ధ్యేయం..
జనరల్

ధర్మపరిరక్షణే కేసీఆర్, జీవన్ రెడ్డి బిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి ధ్యేయం..

-ప్రభుత్వ చర్యలతో తెలంగాణకు ఆధ్యాత్మిక శోభ

-వేల కోట్లతో దేవాలయాల అభివృద్ధి

-ఆధ్యాత్మిక రాజధానిగా యాదాద్రి

-రూ.2వేల కోట్లతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణం

-ఆర్మూర్ గొప్ప దైవచింతన కలిగిన నేల

-పరమశివుడి దివ్యక్షేత్రం సిద్ధులగుట్ట

-భక్తుల కొంగు బంగారం పలుగుట్ట కేదారేశ్వరాశ్రమం

-కేదారేశ్వరాశ్రమ అభివృద్ధికి మరిన్ని చర్యలు

  • కంటి ఆసుపత్రి నిర్మిస్తాం

-త్వరలో అందరికీ ఉచిత నేత్ర చికిత్సలు

-ఎమ్మెల్సీ కవితక్క సహకారం మరువలేనిది

-ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-పలుగుట్ట కేదారేశ్వరాశ్రమంలోఘనంగా సాధూ పరిషత్ 57వ
మహాసభలు

ఆర్మూర్, జనవరి30:- తెలంగాణ వార్త

తెలంగాణ రాష్ట్రంలో ధర్మపరిరక్షణే ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పనిచేస్తున్నారని పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి అన్నారు. నందిపేట్ మండలం పలుగుట్ట కేదారేశ్వరాశ్రమంలో వైభవోపేతంగా నిర్వహిస్తున్న సాధూ పరిషత్ 57వ
మహాసభల్లో సోమవారం ఆయన మాట్లాడుతూ ఈ మహాసభలు తమ ప్రాంతంలో జరుగుతుండటం సంతోషకరమన్నారు.
ప్రభుత్వ చర్యలతో తెలంగాణ రాష్ట్రం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంటున్నదన్నారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తరువాత వేల కోట్ల రూపాయలను వెచ్చిస్తూ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేసే కార్యాక్రమాలు చేపట్టారన్నారు.
ఆధ్యాత్మిక రాజధానిగా రూ.2వేల కోట్లతో యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని పునర్నిర్మించి కేసీఆర్ గారు చరిత్ర సృష్టించారని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. యాదాద్రి ఆలయం ప్రపంచ స్థాయి టెంపుల్ టూరిజంగా అభివృద్ధి చెందుతోందన్నారు.
దేవాలయాల అభివృద్ధికి బడ్జెట్ లో 500 కోట్లు కేటాయింపులు చేయడమే కాక
ధూపదీప నైవేద్యాలు, దేవాలయాల నిర్వహణకు కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్న దమ్మున్న సీఎం కేసీఆర్ గారని ఆయన అన్నారు.
“ఆర్మూర్ గొప్ప దైవచింతన కలిగిన నేల. ఇక్కడ ఎన్నో ప్రముఖ ఆలయాలు ఉన్నాయి.
ముఖ్యంగా పరమశివుడి దివ్యక్షేత్రంగా సిద్ధులగుట్ట భక్తకోటిని పరవశింపజేస్తోంది. పురాతన కాలంలో 9మంది సిద్ధులు తపస్సు చేసిన
ఫలితంగా ఈ పుణ్యక్షేత్రం నవనాధ సిద్ధులగుట్టగా ప్రసిద్ధి చెందింది. పరమశివుడి దివ్యఆలయంతో పాటు శివలింగం కలిగిన గుహ ఉండడం సిద్ధులగుట్ట ప్రత్యేకత. సిద్ధులగుట్టను గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని సంకల్పించి ఇప్పటికే రూ.20కోట్లతో ఘాట్ రోడ్డు వేయించాం. సిద్ధులగుట్ట పై మరెన్నో నిర్మాణాలు చేపట్టాం. మహాపీఠాధిపతులు, సాధువులు ఈ మహాసభలు ముగిసిన తరువాత సిద్ధులగుట్ట శివయ్యను తప్పకుండా దర్శించుకోవాలని ఆర్థిస్తున్నా. భక్తులకు కొంగు బంగారం పలుగుట్ట కేదారేశ్వరాశ్రమం. 34ఏండ్ల కిందట నిజామాబాద్ నగరం శ్రద్ధానంద్ గంజ్ లో సాధూ పరిషత్ మహాసభలు జరిగినట్లు పెద్దలు చెప్పారు. ఇన్నాళ్ల తరువాత ఈ మహోన్నతమైన ఆధ్యాత్మిక మహాసభలు మా ప్రాంతంలో జరుగుతుండటం ప్రజల అదృష్టం.
దేశం నలుమూలల నుంచి 150 మంది పీఠాధిపతులు, సాధువులు మా నేల పై కాలు మోపడం మాకు శుభసూచకం.
ఈ ధర్మపరిరక్షణ మహాకార్యంలో ప్రజలంతా భక్తి పారవశ్యం పొందాలి.
హిందూ సమాజాన్ని జాగృతం చేసేలా సాగే ప్రవచనాలు, ధర్మబోధనలు విని భక్తులు తరించాలి. దేశమంతా తెలంగాణ మోడల్ అమలు కావాలని మహా పీఠాధిపతులు, సాధువులు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఆశీర్వచనాలు అందించాలి” అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. కాగా, కేదారేశ్వరాశ్రమ కర్మ, కర్త, క్రియ అయిన శ్రీ మంగి రాములు మహారాజ్ ప్రజలకు దేవుడితో సమానమన్నారు. దైవదూతగా, ప్రజాసేవకుడుగా, నిత్య అన్నదాన కర్తగా ఆయన లక్షలాది మంది భక్తుల అభిమానం పొందారన్నారు. ఇదిలావుండగా కేదారేశ్వరాశ్రమ అభివృద్ధికి మరిన్ని చర్యలు తీసుకుంటా మన్నారు. ఆశ్రమ అభివృద్ధికి భూమి కేటాయించామని, కొత్తగా రోడ్లు నిర్మిస్తున్నామన్నారు. ఈ ఆశ్రమంతో పాటు సిద్ధులగుట్ట అభివృద్ధికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గారు అందిస్తున్న సహకారాన్ని ఎప్పటికీ మరువలేమన్నారు. కేదారేశ్వరాశ్రమంలో కంటి ఆసుపత్రి నిర్మిస్తామని, కేసీఆర్ గారి ఆశీస్సులతో, కవితక్క సహకారంతో
త్వరలో ఈ ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేసి అందరికీ ఉచిత నేత్ర చికిత్సలు జరిగేలా కృషి చేస్తానని జీవన్ రెడ్డి వెల్లడించారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

జీవన్ రెడ్డి మాల్స్ పై ఆర్. టి. సి గుస్స…45 కోట్ల కిరాయి బాకీ కట్టాలని నోటీసులు..

ఆర్మూర్, తెలంగాణ: వార్త ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో నిర్మించిన జీవన్ రెడ్డి మాల్స్ లో...

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

You cannot copy content of this page