ఆర్మూర్, తెలంగాణ వార్త :ఎమ్మెల్యే జీవనన్నకు మచ్చ తెచ్చే పని చేస్తే ఊరుకునేది లేదు. జీవనన్న అభిమానులు..
ఆర్మూర్ (తెలంగాణ వార్త) జనవరి 31: పియూసి చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి గారికి జిల్లా మరియు నియోజకవర్గ నాయకులు మచ్చ తెచ్చే పని చేస్తే ఊరుకునేది లేదని జీవనన్న అభిమానులు అన్నారు.
ఆర్మూర్ నియోజకవర్గంలో పాటు జిల్లా నగర ప్రాంతాన్ని అభివృద్ధి పథంలో తీసుకుపోవడానికి కంకణం కట్టుకున్న ఆశన్న గారి జీవన్ రెడ్డిని కొందరు వ్యక్తుల ద్వారా ఆర్మూర్ బల్దియాలో మొన్నటికి మొన్న జరిగిన మున్సిపల్ వివాదాల వెనుక అంతర్యాలు ఏమున్నప్పటికీ ప్రజల యోగక్షేమాలు నిరంతర అభివృద్ధి నగర పట్టణ అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న జీవనన్నకు నిండు మనసుతో ఆశీస్సులు ఉండాలని తప్ప,మచ్చ తెచ్చే పనిచేస్తే సహించేది లేదని అభిమానులు ముక్తకంఠంతో తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ లో అవినీతి అక్రమాలపై అంతర్గత సమాచార విచారణల మీద సంబంధిత జీవనన్న అభిమానుల బృందం ఎప్పటికప్పుడు మున్సిపల్ పై కన్ను వేసి ఉందని మున్సిపల్ లో జరిగే ప్రతి అంశం జీవనన్నకు చేరుతుందని తద్వారా జీవనన్న తీసుకునే నిర్ణయంలో ఎలాంటి మార్పు ఉండదని తెలంగాణ వార్తలకు వచ్చిన సమాచారం.
◆ ఆర్మూర్ మున్సిపల్ అవినీతి అక్రమాలపై నిరంతరంగా వార్త రూపంలో నిజాలను నిర్భయంగా రాస్తూ సాక్షాధారాలతో మీ ముందుకు “తెలంగాణ వార్త” తెలుగు పత్రిక పాఠకులకు అందుబాటులో ఉంటుంది. పాఠకుల వద్ద ఏమైనా సమాచారం ఉంటే ఈ నంబర్ కాల్ చేసి సమాచారం ఇవ్వండి 9440023558
Leave a comment