Home జనరల్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మంత్రి ఓకే..
జనరల్

జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి మంత్రి ఓకే..

హైదరాబాద్, జూన్ 17:( తెలంగాణ వార్త ) ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇళ్ళ స్థలాలకు సంబంధించి మంత్రి కేటీఆర్ పూర్తి సానుకూలంగా స్పందించారు. శుక్రవారం ప్రగతిభవన్ లో తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్, తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ తో కలిసి ఈ విషయమై మంత్రి సుదీర్ఘంగా చర్చించారు.

హైదరాబాద్ నగరంలోని జర్నలిస్టుల సంఖ్య ఎంత..? అర్హులైన జర్నలిస్టులు ఎంతమంది ఉన్నారు..? అందరికీ ఇళ్లు కేటాయించడానికి ఎంత స్థలం అవసరం అవుతుంది అనే విషయాలను చర్చ లో భాగంగా ఆరా తీశారు. దీంతోపాటు జవహర్ లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీ కి సంబంధించిన స్థలాలను సభ్యులకు అప్పగించే విషయంపై కూడా చర్చ జరగగా మంత్రి సానుకూలత వ్యక్తం చేశారు.

హైదరాబాద్ నగరంలోని అర్హులైన ప్రతి జర్నలిస్టుకు కూడా ఇళ్లు ఇచ్చే విధంగా వారం పది రోజుల్లో పూర్తిస్థాయి స్పష్టతను ఇచ్చే దిశగా చర్చలు జరిగాయి. దీంతో హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్న దాదాపు నాలుగు వేల మంది జర్నలిస్టులకు త్వరలో ఇళ్ల స్థలాల సమస్య పరిష్కార దిగగా ముందడుగు పడ్డట్లు అయిందన్నారు TUWJ ప్రధాన కార్యదర్శి, ఆస్కాని మారుతి సాగర్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page