తెలంగాణ వార్త: పంటలు పండుతున్న వ్యవసాయ భూమికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి 12 వేల రూపాయలు ఇవ్వనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి సెక్రటేరియట్లో జరిగిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అలాగే వ్యవసాయ భూమిలేని ప్రతి కుటుంబానికి సంవత్సరానికి 12,000 ఇవ్వనున్నట్టు ఆయన తెలిపారు. నూతన సంవత్సరంలో రైతులకు శుభవార్త అందించాలన్న కోరికపై ఆత్మీయ ఇందిరమ్మ భరోసా పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. రైతులకు పాత్రికేయ మిత్రులు మీడియా మిత్రులు తికమక పెట్టారని అవేమీ సరైనవి కావని స్పష్టం చేశారు ప్రతి రైతుకు ఎకరానికి 12000 ఇస్తామని అలాగే జనవరి 26 తేదీ నుండి తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని కమిటీ లో తీర్మానం చేశామని ఆయన తెలిపారు.
Leave a comment