హైదరాబాద్, నవంబర్6:- తెలంగాణ వార్త
మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో ప్రజలతో మమేకమై పనిచేసి టీఆర్ ఎస్ గెలుపులో భాగస్వామి అయ్యారని టీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పీయూసీ చైర్మన్, ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి ని అభినందించారు.
ఈ ఉప ఎన్నికల్లో దండుమల్కాపూర్ ఇంఛార్జి గా ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పనిచేసిన సంగతి తెలిసిందే. కసిగా
దండు మల్కాపూర్ లో టీఆర్ ఎస్ కు భారీ మెజారిటీ వచ్చింది. చౌటుప్పల్ మండలమంతా కలిపి టీఆర్ ఎస్ మెజారిటీ కేవలం 327 ఓట్లు రాగా ఒక్క దండు మల్కాపూర్ లోనే 457 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి మంత్రి కేటీఆర్ ను కలిసి మునుగోడు లో టీఆర్ ఎస్ విజయోత్సవ సంతోషం పంచుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జీవన్ రెడ్డి సమర్ధత వల్లే దండుమల్కాపూర్ గులాబీ దండుగా మారి పార్టీ కి మెజారిటీ వచ్చిందని ప్రశంసించారు. అధ్బుతంగా పని చేశావు జీవన్ అంటూ కితాబిచ్చారు.
Leave a comment