Home జనరల్ <em>తెలంగాణకు ప్రధాని రాకతో…. ఢిల్లీకి పరారైన కెసిఆర్…..</em>
జనరల్

తెలంగాణకు ప్రధాని రాకతో…. ఢిల్లీకి పరారైన కెసిఆర్…..

హైదరాబాద్ శేర్లింగంపల్లి,తెలంగాణ వార్త ::

రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయనున్న నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకం

తెలంగాణకు విచ్చేయుచున్న మన ప్రధాని నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి భారీ ర్యాలీతో బేగంపేట విమానాశ్రయంకు బయలుదేరిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు

ఈరోజు రామగుండం ఎరువులు ఫ్యాక్టరీని జాతికి అంకితం చేయడానికి విచ్చేయుచున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి , బేగంపేట విమానాశ్రయానికి విచ్చేయుచున్న నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి భారీ ఎత్తున మహిళలు, నాయకులు, కార్యకర్తలతో బయలుదేరిన బిజెపి రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు, సందర్భంగా రవికుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ 1999 ముత పడిన ఎరువుల ఫ్యాక్టరీనీ ఆత్మ నిర్భర్ లో భాగంగా 2015 లో పునరుద్దరణ పనులను ప్రారంభించి 2021 ఫిబ్రవరి 28 లో పూర్తిచేసి దాదాపు 23 సంవత్సరాల తరువాత 6120 కోట్ల రూపాయల ఖర్చుతో పునరుద్ధరించి ..ఈరోజు దేశానికి అంకితం ఇవ్వడానికి విచ్చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్రమోడీ గారికి ఘన స్వాగతం పలకడానికి ఈరోజు మనం అందరం కలిసి వెళ్ళడం చాలా ఆనందంగా ఉంది. ఈ ఎరువుల ఫ్యాక్టరీ వల్ల మన తెలంగాణ ప్రజలకు రైతులకు ఎంతో మేలు చేకూరుతుంది, దాదాపు 5000 ఉద్యోగాలు లభిస్తాయి. ప్రతి సంవత్సరం ఉత్పత్తి అయ్యే 12.5 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులలో సగం మన తెలంగాణకే దక్కుతుండడం చాలా మంచి విషయం, 3700 రూపాయలు గల యూరియా బస్తా 94% సబ్సిడీతో 200 కే లభిస్తుంది. అలాగే 1000 కోట్లతో భద్రాచలం రోడ్డు సత్తుపల్లి రైలు మార్గం జాతికి అంకితం చేయటం, 2200 కోట్లతో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన చేయటం గొప్ప పరిణామం అని అన్నారు, మోడీ గారు తెలంగాణకు ఇంత మంచి పనులు చేపడుతుంటే స్వాగతం పలకాల్సిన కెసిఆర్ ఢిల్లీకి వెళ్ళటం సిగ్గుచేటు అని అన్నారు, ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు,జిల్లా నాయకులు, కార్పొరేటర్లు, కంటెస్టడ్ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

టిఆర్ఎస్ పార్టీ ప్రకటించిన ఎమ్మెల్యేలు వీరే.

1 సిర్పూర్ Sirpur కోనేరు కోనప్ప2 చెన్నూరు Chennur బాల్క సుమన్‌3 బెల్లంపల్లి Bellampalli చిన్నయ్య...

జనరల్

అందరం కలిసికట్టుగా బిజెపిని గెలిపించుకుందాం బిజెపి నాయకుడు మోహన్ రావు పటేల్…

తెలంగాణ వార్త:: ఆదివారం నుండి వారం రోజుల పాటు నిర్వహించేఅసెంబ్లీ ప్రవాస్ యోజన  లో భాగంగా...

జనరల్

కాంగ్రెస్ నుండి బిఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి జంప్..

తెలంగాణ వార్త :: కాంగ్రెస్ పార్టీ నుండి బిఆర్ఎస్కు కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి టిఆర్ఎస్ తీర్థం...

జనరల్

మాధ్యమిక స్కూల్లో విష ఆహారం తిని విద్యార్థుల అస్వస్థత..

తెలంగాణ వార్త ::ముధోల్ నియోజకవర్గం :- బిద్రెల్లీ మాధ్యమిక పాఠశాలలో విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేసిన...

You cannot copy content of this page