Home జనరల్ ఖతర్నాక్ పాత్రలో జగ్గారెడ్డి…
జనరల్

ఖతర్నాక్ పాత్రలో జగ్గారెడ్డి…

తెలంగాణ వార్త::: మరోసారి విభిన్నమైన నిర్ణయం తీసుకున్నారు జగ్గారెడ్డి. సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టనున్నారు. అది కూడా నటుడిగా. సాధారణంగా సినిమాల్లో పాపులర్ అయ్యాక కొందరు యాక్టర్లు రాజకీయాల్లోకి అడుగుపెడతారు. జగ్గారెడ్డి మాత్రం దశాబ్దాల రాజకీయ జీవితం తర్వాత సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రం ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయింది.

లవ్ స్టోరీగా.. ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇలా..

ఈ చిత్రం ‘జగ్గారెడ్డి’ టైటిల్‍తోనే రానుంది. లవ్ ఆఫ్ వార్ అనే ట్యాగ్‍లైన్ ఉంది. ఓ యువ జంట ప్రేమ కథ ఆధారంగా ఈ చిత్రం సాగుతుంది. వారిని సంరక్షించే నాయకుడిగా జగ్గారెడ్డి నటించనున్నారు. ఈ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్స్ వచ్చాయి. ఇంటెన్స్ లుక్‍లో జగ్గారెడ్డి కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో యాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుందనిపిస్తోంది.

పాత్ర ఇలా..

ఈ మూవీలో తన పాత్ర ఎలా ఉంటుందో జగ్గారెడ్డి వెల్లడించారు. యువ జంట ప్రేమను కాపాడే క్యారెక్టర్ తాను చేస్తున్నానని, ఇంటర్వెల్ ముందు నుంచి మూవీ చివరి వరకు తాన పాత్ర ఉంటుందని మీడియాతో చిట్‍చాట్‍లో వెల్లడించారు. తన నిజజీవిత క్యారెక్టర్‌కు ఈ సినిమా పాత్రకు పోలికలు ఉంటాయని అన్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఉగాదికి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నట్టు వెల్లడించారు. తెలుగు, హిందీ భాషల్లో పాన్ ఇండియా రేంజ్ రిలీజ్‍కు ప్లాన్ చేస్తున్నట్టు చెప్పారు.

తాను మరిన్ని సినిమాల కథలు వింటానని జగ్గారెడ్డి చెప్పారు. పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి అనుమతితో చిత్రాలు చేస్తానని అన్నారు. తాజాగా ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితాలో జగ్గారెడ్డి పేరు కనిపించలేదు. ఈ తరుణంలో ఆయన సినీ ఎంట్రీ ప్రకటన రావడం హాట్‍టాపిక్‍గా మారింది.

జగ్గారెడ్డి మూవీకి వడ్డీ రామానుజం దర్శకత్వం వహిస్తారని పోస్టర్ ద్వారా వెల్లడైంది. కథ, స్క్రీన్‍ప్లే కూడా ఆయనే. ఇంటెన్స్ లవ్ యాక్షన్ డ్రామాగా ఇది ఉంటుందని ఫస్ట్ లుక్ పోస్టర్లతో అర్థమవుతోంది.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రయాణికులు ప్రాంగణాన్ని తనిఖీ చేసిన ఎస్ హెచ్ ఓ..

తెలంగాణ వార్త. ధోండి మోహన్. ఆర్మూర్ ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్మూర్ పోలీస్‌స్టేషన్ ఎస్‌హెచ్‌ఓ మరియు సిబ్బంది...

జనరల్

అంగరంగ వైభవంగా రైజింగ్ గ్లోబల్ సమ్మిట్..

హైదరాబాద్ తెలంగాణ బ్యూరో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోన్న తెలంగాణ రైజింగ్...

జనరల్

నాయకులు చేస్తే సంసారం? అధికారులు చేస్తే వ్యభిచారమా!ఆర్మూర్ రూటు సపరేటు!ఇది ఎక్కడి న్యాయం..

*తెలంగాణ వార్త* హైదరాబాద్ (సిటీ బ్యూరో) దోండి మోహన్ సీనియర్ జర్నలిస్ట్ నిజామాబాద్ జిల్లా ఆర్మూర్...

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

You cannot copy content of this page