ఆర్మూర్ పరిధిలోని పెర్కిట్లో ఆఆఆర్మూర్ర్న్రధిలోని పెరికిట్లో
ఎంతో విలువగల ఏరియాలో ఆర్మూర్ మున్సిపల్ చైర్
పర్సన్ పండిత్ వినీత భర్త పండిత్ పవన్ ఆయన
సన్నిహితులతో కలిసి భూకబ్జాకు యత్నించిన సంఘటన
అలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూర్తివివరాల్లోకాళితే
ఆర్మూర్ మున్సిపల్ లో గత మున్సిపల్ ఎన్నికల కంటే
ముందు పెర్కిట్, మామిడిపల్లి గ్రామపంచాయతీలు
విలీనమైన విషయం అందరికీ తెలిసిందే. పెర్కిట్
గ్రామపంచాయతీగా ఉన్న సమయంలోనే విశాఖ నగర్
కాలనీ ప్రక్కన, విజేత అపార్ట్మెంట్ వెనుక భాగంలో
జాన్కంపేట్ గ్రామానికి చెందిన వినోద్ రెడ్డి, నలుగురు
సన్నిహితులతో కలిసి 2011 సంవత్సరంలోనే డీటీసీపీ
అప్రూవల్ రెండు లేఔట్లను 436 సర్వేనంబర్ లో గల
తొమ్మిది ఎకరాల 17 1/2 గుంటల భూమిలో 76-2011,
78-2011 నంబర్లతో తీసుకున్నారు.. ఈ లే అవుట్ లలో గల ప్లాట్ లను మెజారిటీ మొత్తంగా అప్పట్లోనే అమ్మకాలు జరిపి కొన్ని ప్లాట్లను ఆయనే ఉంచుకున్నారు. కానీ ప్రపంచాన్ని ఒక కుదుపు కుదిపేసిన కరోనా సమయంలో కరోనా వ్యాధిని పడి 2020 సంవత్సరంలో జాన్కంపేట్ వినోద్ రెడ్డి మృత్యువాత పడ్డారు. జాన్కంపేట్ వినోద్ రెడ్డి చనిపోయిన విషయాన్ని ఆసరాగా చేసుకుని 2011 సంవత్సరంలోనే లేఔట్ చేసిన 436 సర్వే నంబర్ కు సంబంధించిన భూమిలో 2016 సంవత్సరంలో అదే భూమిని కొనుగోలు చేశామంటూ తప్పుడు బాండ్ పేపర్ను సృష్టించి బై నెంబర్ సాయంతో ఆర్మూర్ చైర్ పర్సన్ భర్త పండిత్ పవన్ ఆయన సన్నిహితులతో కలిసి తప్పుడు అగ్రిమెంట్ పేపర్లను సృష్టించుకున్నాడు. విశాఖ నగర్ ఏరియాలో ప్రస్తుత మార్కెట్లో 30 వేల పైచిలుకు గజం చొప్పున ధర పలుకుతుంది. గజానికి 30 వేల రూపాయల విలువ గల ఏరియాలో సుమారు 30000 గజాల విస్తీర్ణాన్ని కబ్జా చేసేందుకు తప్పుడు అగ్రిమెంట్ పేపర్లను తయారు చేసుకొని, గతంలోనే లేఔట్ చేసిన స్థలం కబ్జాకు పూనుకున్నారు. 2011 సంవత్సరంలోనే లేబెట్ చేసిన దాంట్లో ప్లాట్లు కొనుగోలు చేసిన పాట్ల యజమానులు, లేఔట్ చేసిన జాన్కంపేట్ వినోద్ రెడ్డి బంధువులు అడ్డుకొని సదరు కబ్జాదారులను గట్టిగా ప్రశ్నించారు. వారికి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లను పట్టా పాస్ బుక్కులు ఎలాంటివి చైర్ పర్సన్ భర్త ఆయన సన్నిహితులు చూపించలేదని విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలిసింది. ఈ వ్యవహారంలో జానకంపేట వినోద్ రెడ్డి తమ్ముడు. శ్రీనివాస్ రెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పండిత్ పవన్ తో గొడవ జరిగి బాహ బాహికి దిగగా తగులాటలో చైర్ పర్సన్ భర్త పవన్ గల్ల పట్టి మరి శ్రీనివాస్ రెడ్డి బెదిరించినట్లు ఆర్మూర్ ప్రాంత ప్రజలు కోడైకొస్తున్నారు. ఈ విషయంలో స్థానికులు, ప్లాట్ల ఓనర్లు, వినోద్ రెడ్డి బంధువులు ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ తో తీవ్రంగా వాగ్వాదం చేసి ఆగ్రహాన్ని వెలిబుచ్చినట్లు తెలిసింది. దీంతో ఆర్మూర్ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పండిత్ పవన్ అక్కడి నుంచి మెల్లగా జారుకున్నట్లు ఆలస్యంగా తెలిసింది. మరుసటి రోజు అదే ఏరియాలో సెటిలర్ల రెడ్డి సంఘం లో సత్యనారాయణ స్వామి వ్రత పూజలో పాల్గొనేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆయన సతీమణి రజిత రెడ్డిలు సతీ సమేతంగా హాజరయ్యారు. కానీ మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పండిత్ పవన్ ఆ ఏరియాలో విద్యుత్ సరఫరా కానీయకుండా వైర్లను తొలగించినట్లు ఆలస్యంగా సత్యనారాయణ పూజలో ఉన్న ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలిసిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి పండిత్ పవన్ చేసిన అనాలోచిత చర్య పై కోపోద్రిక్తుడు అయినట్లు తెలిసింది. మున్సిపల్ చైర్ పర్సన్ భర్త పండిత్ పవన్ ఆయన సన్నిహితులతో కలిసి చేసిన ఈ దుశ్చర్య గురించి ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి తెలియగా కోపగించుకున్నట్లు సమాచారం.
Leave a comment