
…….
తెలంగాణ వార్త:::ఆర్మూర్ పట్టణం లోని లోటస్ స్మార్ట్ పాఠశాలలో చదువుతున్న గడ్డం శ్రీహిత అనే విద్యార్థికి నృత్యమాల నిత్యకలా వెల్ఫేర్ సొసైటీ మరియు సిరి ఆర్ట్స్ అకాడమీ వారు సంయుక్తంగా హైదరాబాద్ రవీంద్రభారతి లో అంతర్జాతీయ మహిళల దినోత్సవం సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆంధ్ర నాట్యం లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు నృత్యాశ్రీ అవార్డు ను ప్రదానం చేయడం జరిగింది. ఇట్టి అవార్డ్ పొందిన విద్యార్థికి పాఠశాల కరస్పాండెంట్ అంబిక పవార్ అభినందిస్తూ ఇట్టి అవార్డు పొందటం మా పాఠశాల కే కాకుండా ఆర్మూర్ పట్టణానికి గర్వకారణం అని, గతంలో ఇట్టి విద్యార్థికి కూచిపూడి నాట్యం లొ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా స్థానం సంపాదించడం జరిగింది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్ధిని తల్లితండ్రులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు…
Leave a comment