Home జనరల్ మిస్సింగ్ కేసు మిస్టరి చేదించిన నందిపేట్ పోలీసులు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన ఆర్మూర్ ఏసీపి ప్రభాకర్ రావు……
జనరల్

మిస్సింగ్ కేసు మిస్టరి చేదించిన నందిపేట్ పోలీసులు ప్రెస్ మీట్ లో వివరాలు వెల్లడించిన ఆర్మూర్ ఏసీపి ప్రభాకర్ రావు……

నందిపేట్, ,తెలంగాణ వార్త::

డబ్బుల కక్కుర్తి స్నేహితుని ప్రాణం తీయడానికి కూడా వెనకాడ లేదు తన అవసరాల కొరకు తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వకూడదని దుర్బుద్ధితో డబ్బులు ఇచ్చిన స్నేహితుని ప్రాణం తీసిన ఘటన నందిపేట్ మండలం ఉమ్మేడ గ్రామంలో జరిగింది.
నందిపేట్ పోలీస్ స్టేషన్ ఆవరణలో బుధవారం నిర్వహించిన ప్రెస్ మీట్ లో ఆర్మూర్ ఏసిపి ప్రభాకర్ రావు వెల్లడించిన వివరాల ప్రకారం నిందితుడు నాగం భోజేందర్ అలియాస్ చింటూ ఉమ్మడి గ్రామ వాసి అయిన నాగం భోజేందర్ అలియాస్ చింటూ అదే గ్రామానికి చెందిన తన స్నేహితుడు ఆయన ఎరగట్ల శ్రీకాంత్ ను 2 డిసెంబర్ 2022 రోజున ఉమ్మేడ వంతెన పై పిలిచి ఎవరికి అనుమానం రాకుండా ఆత్మహత్యగా చిత్రీకరించడానికి బ్రిడ్జి పై నుండి తోసేసి చంపిన వ్యక్తిని బుధవారం ఉదయం నందిపేట్ మండల కేంద్రంలో అరెస్టు చేసినట్లు మీడియా సమావేశంలో వెల్లడించారు.

30 నవంబర్ 2022 రోజున సాయంత్రం ఇంట్లో నుండి బయటకి వెళ్ళి తిరిగి ఇంటికి రాలేదని కుటుంబ సభ్యులు దరఖాస్తు చేయగా నందిపేట్ ఎస్ ఐ శ్రీకాంత్ C.No. 172/2022 U/S మిస్సింగ్ కేసునమోదు చేసి దర్యాప్తు చేపట్టగా, తేదీ 03.12.2022 రోజున ఎర్గట్ల శ్రీకాంత్ యొక్క బైక్ మరియు మృత దేహం ఉమ్మెడ బ్రిడ్జ్ దగ్గర లభ్యమయి దొరికింది. మృతదేహాన్ని పంచానన చేసి పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి నిజామాబాద్ కు తరలించినారు. ఆ తర్వాత దర్యాప్తు ప్రారంబించి అనుమాన వ్యక్తుల పై నిఘా పెంచి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం సహాయం తో విచారణలో భాగంగా బుధవారం నందిపేట్ బస్ స్టాండ్ లో మృతుడి స్నేహితుడు అయిన నాగం బొజేందర్ అలియస్ చింటు ని పట్టుకొని విచారించగా తన స్నేహితున్ని తనే చంపిన విషయాన్ని ఒప్పుకొన్నాడు.
తన స్నేహితుడు అయిన ఏర్గట్ల శ్రీకాంత్ నుండి అందాజ 2. లక్షల రూపాయల వరకు ఎవరికి తెలీకుండా తన అవసర నిమిత్తం తీసుకున్నాడు అయితే దుబాయి నుండి తిరిగి వచ్చిన మృతుడు తన డబ్బులు తనకి ఇవ్వమని పదే పదే అడగగా అతనిని చంపివేస్తే డబ్బులు ఇవ్వాలసిన పని వుండదని ఘోరమైన పథకం ప్రకారం తేదీ 3 డిసెంబర్ .2022 రోజున సాయంత్రం 06:30 గంటల సమయం లో ఏర్గట్ల శ్రీకాంత్ కి ఫోన్ చేసి ఉమ్మెడ నది బ్రిడ్జ్ దగ్గరికి రమ్మని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ బ్రిడ్జ్ గోడ పైన కూర్చున్న తర్వాత అకస్మాతుగా ముందుగా అనుకున్న ప్రకారం ఏద్దట్ల శ్రీకాంత్ ని నదిలోకి ‘నెట్టేసి చంపివేసినానని.. మృతుడి బైక్ అక్కడే వదిలేసి అందరూ అతనిది ఆత్మహత్య గా అనుకోవాలని అక్కడి నుండి పారిపోయావని విచారణలో ఒప్పుకొన్నాడని ఏ సి పి వివరించారు.

ఈ కేసు పరిశోదనలో కృషి చేసిన ఆర్ముర్ రురల్ సి ఐ. గోవర్ధన్ రెడ్డి , నందిపేట్ ఎస్.ఐ శ్రీకాంత్, ఎస్.ఐ,-2 అలీఫుద్దీన్, ఏ ఎస్ ఐ రాజేందర్ మరియు ముత్యం, లింగం, విట్టల్, గంగనర్సయ్య లను ఏ సి పి ప్రభాకర రావు అభినందించారు.

ఈ కార్యక్రమంలో బి. గోవర్ధన్ రెడ్డి ఇన్స్ పెక్టర్ ఆఫ్ పోలీస్ -ఆర్మూర్ రూరల్ సర్కిల్, నందిపేట్. ఎస్.ఐ . శ్రీకాంత్, ఎస్.ఐ.-2 అరపుద్దీన్ మరియు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.


నిందితుడిని హాజరు పరిచి వివరాలు వెల్లడిస్తున్న ఏసీబీ ప్రభాకర్ రావు, చిత్రంలో సీఐ గోవర్ధన్ రెడ్డి ఎస్సైలు శ్రీకాంత్ , అరిఫుద్దీన్

మోహన్ తెలంగాణ వార్త సిఈవో

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

రేపు విద్యుత్ విజయోత్సవ సభలు..

నిజామాబాద్(తెలంగాణ వార్త)జూన్ 04: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా సోమవారం విద్యుత్...

జనరల్

ఆదర్శంగా నిలుస్తున్నజర్నలిస్ట్ కాలనీ. అభివృద్ధికి నిధులుఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి…

ఆర్మూర్ ( తెలంగాణ వార్త )ఆర్మూర్: ప్రతి ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం...

జనరల్

ఎన్నికలకు ముందే 500 నోట్లు కూడా?

హైదరాబాద్ (తెలంగాణ వార్త) రానున్న ఎన్నికలకు ముందు రెండువేల రూపాయల నోట్లను అరికట్టేందుకు ఆర్బిఐ చేసిన...

జనరల్

జెండా ఊపి మాన్సూన్ వాహనాలను ప్రారంభించిన జోనల్ అధికారిని పంకజ…

రానున్న వర్షాకాలంలో ముంపు మరియు వర్షపు నీరు ఆగిన ప్రాంతాలలో వర్షపు నీటిని వెంటనే తొలగించి...

You cannot copy content of this page