నందిపేట్ మండల కేంద్ర నాగమంతెన సంఘం, సుభాష్ యూత్ ఆధ్వర్యంలో సోమవారం సుభాష్ నగర్ లో గల నేతాజీ విగ్రహానికి పూలమాలవేసి నేతాజీ జయంతి వేడుకలను ఘనంగ… జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ, వి డి సి అధ్యక్షులు మచ్చర్ల సాగర్ మాట్లాడుతూ… భారత స్వాతంత్రం ఆంగ్లేయుల నుండి శాంతియుత మార్గంలో తీసుకోవాలని ఒకపక్క గాంధీ ప్రయత్నిస్తుంటే… శాంతి మార్గం సరికాదు అంటూ మన దేశ స్వాతంత్రాన్ని వాళ్లు ఇచ్చేది ఏందంటూ.. వారిపై తిరగబడి లాక్కోవాల్సిందే అని అజాద్ హింద్ ఫౌజ్ స్థాపించి ఆంగ్లేయుల గుండెల్లో దడ పుట్టించిన స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని కొనియాడారు.ఈ దేశ స్వతంత్రం కోసం బ్రిటిష్ వారి కబంద హస్తాల నుండి భారతదేశాన్ని విడిపించడానికి తన ప్రాణాల సైతం త్యాగం చేశారని, స్వతంత్ర సమయంలో యువతకు స్ఫూర్తినిస్తూ మీరు నాకు రక్తాన్ని ఇవ్వండి ఈ దేశానికి స్వతంత్రాన్ని ఇస్తానని. దేశ యువతకు సందేశాన్ని ఇచ్చిన గొప్ప వీరుడని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందిపేట మండల ఎమ్మార్వో అనిల్ కుమార్, ఎర్రంపంత అధ్యక్షులు పండరి రాజు, ప్యాట్ల పంత అధ్యక్షులు కుమ్మరి సాగర్, బుడ్డవర్కల సంతోష్, సందీప్, పిప్పెర రాజేశ్వర్, సిద్దార్థ స్కూల్ విద్యార్థులు, సుభాష్ యూత్ యువకులు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment