నందిపేట్, తెలంగాణ వార్త ::
నందిపేట్ పోలీస్ ఆధ్వర్యంలో సోమవార ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ ఫ్లాగ్ మార్చ్ నిర్వహించింది. స్థానిక పోలీసు సిబ్బందితో కలిసి చాకలి ఐలమ్మ విగ్రహం నుండి మెయిన్ రోడ్ , బస్ స్టాండ్ , జమే మజీద్, పోచమ్మ గల్లి, నుండి తిరిగి మెయిన్ రోడ్డు గుండా చాకలి ఐలమ్మ విగ్రహం వరకు భారీ కవాతును నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్సై సల్ల శ్రీకాంత్ మాట్లాడుతూ… జిల్లా పోలీస్ కమిసనర్ నాగరాజు సూచన మేరకు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ లను సందర్శించి పోలీస్ సిబ్బందికి తో కలిసి ఆర్ ఏ ఎఫ్ బలగాలు కవతులు నిర్వహాయిస్తున్నరని తెలిపారు.
దేశ వ్యాప్తంగా సామరస్యాన్ని పెంపొందించేందుకు, ప్రజలకు అవగాహన కల్పించేందుకు ఎప్పుడైనా, ఏవైనా వివాస్పదమైన ఘటనలు చోటుచేసుకున్నప్పుడు వెంటనే స్పందించి చర్యలు తీసుకునేందుకు అనువుగా రాపిడ్ యాక్షన్ఫోర్స్ (ఆర్ ఏఎఫ్) దళాలు వున్నయని ప్రజలకు తెలియజేసిందుకు ఇలాంటి కవతులు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్ ఏ ఎఫ్ 99 బెటాలియన్ అసిస్టెంట్ కమాండెంట్ ప్రవీణ్ కుమార్ రావత్, ఆర్ఏఎఫ్ఇన్స్పెక్టర్లు రవీందర్ రోషన్, లాబా కె ఆర్ జాయ్ , స్థానిక ఎస్సై 2 ఆరిపోద్దిన్ , పోలీసు సిబ్బంది, స్థానిక యువత, సాయి కాలేజ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
Leave a comment