తెలంగాణ వార్త::ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో అసైన్ మెంట్, ఓపెన్ ప్లాట్లకు అక్రమంగా కేటాయించిన 140 ఇంటి నంబర్లను రద్దు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ రాజు తెలిపారు. ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇప్పటివరకు ఫిర్యాదులు వచ్చిన 600 ఇంటి నంబర్లపై విచారణ చేసి మొదటి దశలో 140 అక్రమ ఇంటి నంబర్లను రద్దు చేశామన్నారు. సబ్ రిజిస్ట్రార్‌కు సైతం ఈ ఇంటి నంబర్లను ప్రోహిబిషన్ లో పెట్టాలని సూచించామని పేర్కొన్నారు. నంబర్ల రద్దుపై సీడీఎంఏ, కలెక్టర్‌కు వివరాలను పంపామన్నారు. మిగిలిన వాటిపై కూడా త్వరలో విచారణ జరుపుతామని చెప్పారు.
Leave a comment