డిటోనేటర్లకు అనుమతులు నిలిపివేయాలి
అనుమతులు జారీచేస్తే అధికారులు – అధికార పార్టీ నేతలే బాధ్యత వహించాలి
ప్రజా చైతన్యంతో ఉద్యమాలను ఉదృతం చేస్తాం
తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి
బుగ్గారం / జగిత్యాల జిల్లా: తెలంగాణ వార్త;
జగిత్యాల జిల్లా బుగ్గారంలో డిటోనేటర్ ల (బాంబుల) గోదాం అనుమతులు ఎక్కడి కక్కడ నిలిపి వేయాలని తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు అయిన విడిసి కోర్ కమిటీ చైర్మన్ చుక్క గంగారెడ్డి సంబంధిత అధికారులను, అధికార పార్టీ నేతలను కోరారు. బుగ్గారం మండల కేంద్రంలోని బస్టాండ్ లో గల అంబేద్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఆయన గ్రామస్తులతో కలిసి విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్క గంగారెడ్డి మాట్లాడుతూ గ్రామానికి చెందిన జక్కుల లింగన్న తో పాటు మరికొందరు వ్యక్తులు ఈ బాంబుల గోదాం నిర్మాణం కోసం పరోక్షంగా కృషి చేస్తున్నట్లు తమ విచారణలో తేలిందన్నారు. వెంటనే వారి – వారి ప్రయత్నాలు మానుకోవాలని ఆయన కోరారు. లేనిపక్షంలో మీరు గ్రామానికి, ప్రజలకు తీరని ద్రోహం, అన్యాయం చేసిన వారు అవుతారని ఆయన సూచించారు. జక్కుల లింగన్న అనే వ్యక్తి తన భూములను బాంబుల గోదాం నిర్మాణం కోసం విక్రయించడం వెంటనే మానుకోవాలన్నారు. మీ సొంత ప్రయోజనాల కోసం ప్రజల ప్రాణాలకు హాని కలిగించే పనులు చేయడం తగదన్నారు. డిటోనేటర్ ల గోదాం కు భూములు విక్రయించడం, అనుమతుల కొరకు ప్రయత్నాలు చేయడం, పరోక్షంగా సహకరించడం జక్కుల లింగన్న కు, ఇతర వ్యక్తులకు తగదన్నారు.
వెంటనే వారి వైఖరి మార్చుకోవాలని సూచించారు. లేనిపక్షంలో ప్రజలు తగు గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
వివిధ శాఖల అధికారులు దయచేసి ఇలాంటి ప్రాణాంతక డిటోనేటర్ లకు, బాంబుల గోదాం నిర్మాణాలకు ఎలాంటి అనుమతులు జారీ చేయవద్దని, వెంటనే ఆ ప్రక్రియను నిలిపి వేసి ప్రజల ప్రాణాలు, పర్యావరణాన్ని, వణ్య ప్రానులను కాపాడాలని ఆయన కోరారు. ఒకవేళ ఎలాంటి అనుమతులు జారీ అయినా, నాయకుల ప్రయత్నాలు అలాగే కొనసాగినా ప్రజా వ్యతిరేకతతో తగిన గుణపాఠం చెప్పాల్సి వస్తుందన్నారు. ప్రజా చైతన్యంతో ఉద్యమాలను ఉదృతం చేసి ప్రజల ప్రాణాలకే ముప్పు కలిగించే బాంబుల గోదాం పనులను అడ్డుకుంటామని హెచ్చరించారు.
గ్రామ అభివృద్ది కమిటి అధ్యక్షులు నక్క చంద్రమౌళి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కోర్ కమిటి వైస్ చైర్మన్ పెద్దనవేణి రాగన్న,
ఉపాధ్యక్షులు సుంకం ప్రశాంత్, ప్రధాన కార్యదర్శి పెద్దనవేణి రాజేందర్, కోశాధికారి సీగిరి అంజన్న, సహాయ కార్యదర్శి కళ్లెం నగేష్, మాజీ సర్పంచ్ మసర్థి రాజిరెడ్డి, ఏలేశ్వరం గౌరీ శంకర్, దసర్తి పూర్ణ చందర్, మసర్తి అశోక్, పోచమ్మ ఆలయాల కమిటి చైర్మన్ మసర్తి నర్సయ్య, నాయకులు పొనకంటి కైలాసం, జంగ రవి (రమేష్), భారతపు రమేష్, చింతపండు హరీష్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment