Home జనరల్ పవర్ ఉంటే ఇట్లనే మాట్లాడొచ్చు….
జనరల్

పవర్ ఉంటే ఇట్లనే మాట్లాడొచ్చు….

యుద్దానికి సిద్ధమా?

-నీకు దమ్ముంటే నాపై పోటీ చేయి

-తొడగొట్టి చెబుతున్నా నిన్ను పడగొట్టి పాతిపెడతా

-నువ్వెక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తాం

-ఈ ఎన్నికలతో నీ పొలిటికల్ కెరియర్ క్లోజు

-అడ్డగోలుగా వాగితే నీ నాలుక చీరేస్తాం

-అంబేద్కర్ చౌరస్తా లో బట్టలూడదీసి కొడతాం

-ఆర్మూర్ అభివృద్ధి పై చర్చకు రా

-అభివృద్ధి, సంక్షేమ పథకాలలో నీ వాటా ఎంతో చెప్పు

-ప్రజల మధ్య పంచాయితీలు పెట్టే తాకట్లమారివి

-అరాచక శక్తుల జేఏసీకి అధ్యక్షుడివి

-పసుపుబోర్డు తేకుండా రైతుల వెన్ను విరిచిన మోసగాడివి

-నీది రోడ్ షో కాదు మ్యాడ్ షో..అదొక బ్యాడ్ షో

-నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బొంద పెడతాం

-60వేల మెజారిటీతో మూడో సారి కూడా గెలుపు నాదే

-కవితక్కపై నీకెందుకంత అక్కసు

-మంత్రి కేటీఆర్ ని విమర్శించే స్తాయా నీది

-అవినీతికి ప్యాంట్, చొక్కా వేస్తే అది ఎంపీ అరవింద్ రూపం

-కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం

-అభివృద్ధి, సంక్షేమం చూసి సకల జనుల మద్దతు బీఆర్ఎస్ కే

-ఎంపీ అరవింద్ పై నిప్పులు చెరిగిన ఎమ్మెల్యే జీవన్ రెడ్డి

-నందిపేట్ మండలానికి చెందిన వందలాదిమంది బీఆర్ఎస్ లో చేరిక

ఆర్మూర్, జూన్7:- తెలంగాణ వార్త

నిజామాబాద్ ఎంపీ అరవింద్..నీకు దమ్మూ ధైర్యం ఉంటే ఆర్మూర్ లో నాపై పోటీ చెయ్యి.
నాతో యుద్దానికి సిద్ధమా?. తొడగొట్టి చెబుతున్నా నిన్ను పడగొట్టి పాతి పెడతా.. నువ్వెక్కడ పోటీ చేసినా డిపాజిట్లు కూడా రాకుండా ఓడిస్తాం.
ఈ ఎన్నికలతో నీ పొలిటికల్ కెరియర్ క్లోజు” అని పీయూసీ చైర్మన్, ఎమ్మెల్యే, బీఆర్ ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నందిపేట్ మండలం తల్వేద గ్రామానికి చెందిన 500 మందికి పైగా యువకులు, వివిధ కుల సంఘాల నాయకులు బుధ వారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. జరిగింది.
తామంతా బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలకు, ప్రధానంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సమర్థవంత పాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నాయకత్వానికి వారు మద్దతు పలికారు.
అంకాపూర్ లోని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి నివాసంలో జరిగిన కార్యక్రమంలో ఆయన సమక్షంలో వారు గులాబీ తీర్థం పుచ్చు కున్నారు. వారికి జీవన్ రెడ్డి గులాబీ కండువాలు కప్పి బీఆర్ ఎస్ లోకి సాదరంగా ఆహ్వానించారు. పార్టీ లో చేరిన వారికి తగిన గుర్తింపు కల్పిస్తామని, రెట్టింపు గౌరవం ఉంటుందని జీవన్ రెడ్డి భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ గూటికి చేరిన యువకులు “దేశ్ కీ నేత కేసీఆర్, జై జీవనన్న, జై తెలంగాణ” అని చేసిన నినాదాలతో అంకాపూర్ మారుమోగింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ ఎంపీ అరవింద్
అడ్డగోలుగా వాగితే నాలుక చీరేస్తాం. అంబేద్కర్ చౌరస్తా లో బట్టలూడదీసి కొడతాం అని హెచ్చరించారు.
“నీకు దమ్ముంటే ఆర్మూర్ అభివృద్ధి పై చర్చకురా. అభివృద్ధి, సంక్షేమ పథకాలలో నీ వాటా ఎంతో చెప్పు. 3వేల కోట్ల రూపాయలతో ఆర్మూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశా.
ఆర్మూర్ నియోజకవర్గానికి ఒక్క విద్యుత్ సబ్సీడీలే రూ.320కోట్లు వచ్చాయి. నియోజకవర్గంలో 62 వేల మందికి రూ.2016, రూ.3016 చొప్పున ఆసరా పెన్షన్లు అందుతున్నాయి.
62 వేల మందికి రైతుబంధు ద్వారా పెట్టుబడి సాయం అందుతోంది.
12వందల మందికి దళితబంధు స్కీమ్ ద్వారా ద్వారా రూ. 10 లక్షల చొప్పున వచ్చి వారికిష్టమైన యూనిట్లు పెట్టుకొని ఆత్మ గౌరవ పతాకను ఎగురేస్తున్నారు.
కేసీఆర్ సర్కారుకు సకల కులాలూ సమానమే.
ఆర్మూర్ లో వివిధ కులాలకు 17 ఫంక్షన్ హాళ్ల నిర్మాణం చేస్తున్నాం.
గృహలక్ష్మీ ద్వారా 3వేల ఇండ్ల నిర్మాణం చేపడతాం. 4వేల మందికి కొత్తగా ఇండ్ల స్థలాలుపంపిణీ చేస్తాం. సిద్ధులగుట్ట కు రూ. 20కోట్లతో ఘాటు రోడ్డు వేయించా. సెంట్రల్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశా. సిద్ధులగుట్టను దేశంలోనే అధ్బుతమైన శివాలయంగా, పర్యాటక స్థలంగా తీర్చి దిద్దా.
రూ. 120 కోట్లతో పంచగూడ వంతెన కట్టించి నిజామాబాద్-నిర్మల్ జిల్లాల మధ్య దూరం తగ్గించా. నియోజకవర్గమంతా రూ. 500 కోట్లతో రోడ్లు వేయించా. ఆర్మూర్- నిజామాబాద్, నిజామాబాద్- మాక్లూర్ కు రోడ్లు నిర్మించా. ఆర్టీసీ, ఆలూరు, వెల్మల్, నందిపేట్ సహా
తొమ్మిదికి పైగా బైపాస్ రోడ్లు వేయించా. మారంపల్లి బైపాస్ రోడ్డు నిర్మాణంలో ఉంది. ఆర్మూర్ కు వంద పడకల ఆసుపత్రి సాధించా. ఈ దవాఖానలో ఇప్పటికే 25 వేలకు పైగా ఉచిత ప్రసవాలు జరిగి కేసీఆర్ కిట్లు అందించాం. ఉచిత ప్రసవాల వల్ల ఒక్కొక్కరికి రూ.50వేల చొప్పున ఖర్చు తప్పింది. అనారోగ్యంతో బాధపడుతున్న 25వేల మందికి పైగా సీఎం ఆర్ ఎఫ్ నిధులు మంజూరు చేయించా. మరో అయిదు వేల మందికి
ఎల్ వోసీ చెక్కులు ఇప్పించి వారి ప్రాణాలు కాపాడా. నా దగ్గరకు వచ్చి అడిగిన వెంటనే ప్రయివేటు ఆసుపత్రులలో డిస్కౌంట్ ఇప్పించా.
ఆర్మూర్ ను రెవెన్యూ డివిజన్ గా మార్చా.
కొత్తగా డొంకేశ్వర్, ఆలూరులను మండలాలుగా మార్పించా. గొల్ల, కురుమ సోదరులకు గొర్రెల యూనిట్లు మంజూరు చేయించా. రైతుబీమా వస్తోంది. 450 కోట్ల రూపాయలు ఖర్చు చేసి మొత్తం నియోజకవర్గంలోని 81 గ్రామాలకు, 36 వార్డులకు ఇంటింటికీ మిషన్ భగీరధ మంచి నీళ్లు సరఫరా చేస్తున్నాం. ఒకప్పుడు కేవలం మంచినీళ్ల కోసం రాజారామ్ నగర్ లో హత్య జరిగిన టువంటి దారుణ పరిస్థితులు ఇప్పుడు లేవు. గురుకుల పాఠశాలల్లో ఏడాదికి ఒక్కొక్క విద్యార్థికి ఒక లక్షా 25వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తూ ఇంగ్లీషు మీడియంలో విద్య నేర్పిస్తున్నాం. రూ. 120కోట్లతో పత్తేపూర్-చేపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును సాధించా. కల్యాణ లక్ష్మీ, షాదీముబారక్ ద్వారా ఒక లక్షా 116 రూపాయల చొప్పున ఇస్తూ 15వేల నుంచి 20వేల మంది పేదింటి ఆడ పిల్లల పెండ్లిండ్లు జరిపించాం. గుండ్ల చెరువు ట్యాంక్ బండ్ ను అభివృద్ధి చేశా. నాయీ బ్రాహ్మణ, రజక సోదరులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తున్నాం. అంబేద్కర్ స్పూర్తితో మా పాలన సాగుతోంది. పరిపాలన రధమైన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాం. 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం ప్రతిష్టించి భారత రాజ్యాంగ నిర్మాతకు ఘనమైన నివాళి అర్పించాం. కేసీఆర్ గారిది సుభిక్ష పాలన. ఆయన సాధించిన తెలంగాణ మోడల్ దేశానికే ఆదర్శం. తెలంగాణ పథకాలు తమకూ కావాలని అన్ని రాష్ట్రాలూ అడుగుతున్నాయి. మహారాష్ట్రతో సహా అనేక రాష్ట్రాల ప్రజలు బీఆర్ఎస్ లో చేరుతున్నారు. ఏ తల్లి, ఏ చెల్లిని అడిగినా మా ఇంటి పెద్ద కొడుకులా కేసీఆర్ అమలు చేస్తున్న పథకాల వల్ల సంతోషంగా ఉన్నామని చెబుతున్నారు. తామంతా సారు, కారు, కేసీఆర్, బీఆర్ఎస్ వైపే అని అంటున్నారు. నాలుగేళ్లు ముఖం చాటేసి ఇప్పుడు ఆర్మూర్ వచ్చిన ఎంపీ అరవింద్ ను ఎవరూ పట్టించుకోరు. నిజామాబాద్ జిల్లా బీజేపీలో తొమ్మిది గ్రూపులు ఉన్నాయి. ఆర్మూర్ లో ఉన్న తొమ్మిది మంది తామే అభ్యర్థులు అని తిరుగుతున్నారు. అవినీతికి ప్యాంట్, చొక్కా వేస్తే అది ఎంపీ అరవింద్ రూపం. డబ్బు తినమరిగిన అరవింద్ బీజేపీ నాయకుల మోచేతికి బెల్లం రాసి నాకిస్తూ నువ్వే అభ్యర్థివి అంటూ అవినీతి ఆట ఆడుతుండు. ప్రజల కష్ట సుఖాలు ఏనాడూ పంచుకోని అరవింద్ ను ఏ గ్రామం వెళ్లినా ప్రజలు చితకబాదడం ఖాయం. అరవింద్ ప్రజల మధ్య పంచాయితీలు పెట్టే తాకట్లమారి.
అరాచక శక్తుల జేఏసీకి అధ్యక్షుడు.
పసుపుబోర్డు తేకుండా రైతుల వెన్ను విరిచిన మోసగాడు.
ఆర్మూర్ లో అరవింద్ చేసింది రోడ్ షో కాదు మ్యాడ్ షో. అదొక బ్యాడ్ షో. ఆర్మూర్ ను నిండా ముంచే కుట్రతో చేసిన వెకిలి చేష్టలు. నిజామాబాద్ జిల్లాలో బీజేపీని బొంద పెడతాం. కర్ణాటక ప్రజలు చెప్పుతో కొట్టినా బీజేపీకి బుద్ధి రాలేదు. అరగుండు అరవింద్ ఎన్ని చిల్లర వేషాలేసినా నేను
60వేల మెజారిటీతో మూడో సారి కూడా గెలుస్తా. కవితక్కపై నీకెందుకంత అక్కసు.
మంత్రి కేటీఆర్ ని విమర్శించే స్తాయా నీది. వారి కాలిగోటికి కూడా అరవింద్ సరిపోడు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శం.
అభివృద్ధి, సంక్షేమం చూసి సకల జనుల మద్దతు బీఆర్ఎస్ కే లభిస్తోంది అని జీవన్ రెడ్డి పేర్కొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఉచితంగా బతుకమ్మ దసరా చీరలు పంపిణీ చేసిన రవీందర్ యాదవ్….

కార్మికుల కుటుంబాలు సంతోషంగా ఉండాలి పారిశుద్ధ్య కార్మికులకు చీరలను పంచిన రవీందర్ యాదవ్ బతుకమ్మ, దసరా...

జనరల్

డి.పోచంపల్లి లో రాజ శ్యామల యాగంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు..

డి పోచంపల్లి, తెలంగాణ వార్త:: డి. పోచంపల్లి లో ఆర్కే ఎంటర్ప్రైజెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ...

జనరల్

వాహనం ఢీకొని బాలుడు మృతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: టాటా ఎస్ వాహనం ఢీకొని బాలుడు మృతి చెందిన ఘటన భీమ్...

జనరల్

రెవెన్యూలో మళ్లీ వీఆర్వో ల పోస్టులు. మంత్రి పొంగులేటి….

హైదరాబాద్, తెలంగాణ వార్త:: రాష్ట్రంలో మళ్లీ వీఆర్‌వో, వీఆర్‌ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి...

You cannot copy content of this page