Home జనరల్ పతనమవుతున్న బంగారం ధరలు. తులం ధర ఎంత అంటే..
జనరల్

పతనమవుతున్న బంగారం ధరలు. తులం ధర ఎంత అంటే..

(తెలంగాణ వార్త) బంగారం కొనాలనుకునేవారికి గుడ్‌న్యూస్. అనుకున్నట్లే యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లు మరోసారి పెంచింది. దీంతో డాలర్ పుంజుకొని.. మళ్లీ బంగారం ధరలు పతనం కానున్నాయి. ప్రస్తుతం ఒక్కరోజే గోల్డ్ రేటు భారీగా పతనమైంది. ప్రస్తుతం ఎక్కడ గోల్డ్, సిల్వర్ రేట్లు ఎలా ఉన్నాయో మనం ఇప్పుడు చూద్దాం.

పసిడి ప్రియులకు అలర్ట్. గత 10-15 రోజుల వ్యవధిలో భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు తాజాగా భారీగా పతనమయ్యాయి. ఒక్కరోజే గోల్డ్ రేటు రూ.800కుపైగా దిగొచ్చింది. రూ. 60 వేల మార్కును కోల్పోయింది. మరోవైపు సిల్వర్ కూడా భారీగానే తగ్గింది. ఇక రానున్న రోజుల్లోనూ వీటి రేట్లు పడిపోయే ఛాన్స్ ఉంది. అందుకు వీలుగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను మరోసారి పెంచింది. సాధారణంగానే వడ్డీ రేట్లు పెంచినప్పుడు డాలర్ పుంజుకుంటుంది. దీంతో బాండ్ ఈల్డ్స్‌కు గిరాకీ పెరిగిపోయి అప్పుడు బంగారం సురక్షితమైనదిగా భావించరు. దీంతో విలువ పడిపోతుంది. గతంలో వడ్డీ రేట్లు పెంచిన దాదాపు ప్రతిసారీ ఇలాగే జరిగింది. ఇప్పుడు అమెరికాలో ప్రస్తుతం బ్యాంకింగ్ రంగంలో సంక్షోభం నెలకొన్నప్పటికీ ఫెడ్ మరోసారి 25 బేసిస్ పాయింట్ల మేర వడ్డీ రేట్లను పెంచింది. దీంతో ఇక గోల్డ్ రేట్ల పతనం ప్రారంభమయిందనే నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం ధరలు ఎక్కడ ఎలా ఉన్నాయంటే?

హైదరాబాద్‌లో 22 క్యారెట్లకు చెందిన తులం గోల్డ్ రేటు 10 గ్రాములకు ఒక్కరోజే రూ.800 మేర పతనమై రూ.54,200 మార్కుకు చేరింది. ఇటీవల ఒక దశలో ఇది రూ.55,300 వద్ద జీవనకాల గరిష్టాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మరోవైపు 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు హైదరాబాద్‌లో తాజాగా రూ.870 పడిపోయి రూ.59,130 వద్ద కొనసాగుతోంది. ఇది 3 రోజుల కిందట రూ.60,320 వద్ద ఆల్ టైం హై ని తాకింది.

ఇదే సమయంలో దేశ రాజధాని దిల్లీలో గోల్డ్ రేటు భారీగా తగ్గింది. అక్కడ 10 గ్రాములకు ఒక్కరోజు రూ.800 పతనమై రూ.54,350కి చేరింది. ఇక 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములకు దేశ రాజధానిలో రూ.870 పతనమై.. రూ.59,280 మార్కుకు చేరింది.


Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ప్రధానిని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావు..

ప్రధాని మోడీని కలిసిన మాజీ ఎంపీపీ జివి రమణ రావునిర్మల్ ,బైంసా తెలంగాణ వార్త నిర్మల్...

జనరల్

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఐఏఎస్ అధికారిణి

తెలంగాణ శాసనసభ ఎన్నికలు 2023 నేపథ్యంలో ఈ రోజు శ్రీమతి. భారతి హోలికేరి గారు, ఐఏఎస్,...

జనరల్

బోజా రెడ్డి వైపే ముధోల్ ప్రజల చూపు…

భైంసా ముధోల్ ముధోల్ ముధోల్ మండల నియోజకవర్గంలో బిజెపి టికెట్ ఆశించిన వారిలో బద్దం బోజా...

జనరల్

అధికార పార్టీకి అసమ్మతి సెగ పార్టీ వీడిన బి ఆర్ ఎస్ క్యాడర్…

టిఆర్ఎస్ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డికి నిరసనగా ముధోల్, తెలంగాణ వార్త ; అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న...

You cannot copy content of this page