Home జనరల్ పేర్కిట్ ఆశా ఆశుపత్రి లో ఏం జరుగుతుంది..
జనరల్

పేర్కిట్ ఆశా ఆశుపత్రి లో ఏం జరుగుతుంది..

మొన్నటికి మొన్న మానవత్వం చాటిన ఆశ హాస్పిటల్ కు ఈ మచ్చలేంటి.?

– ఆశ ఆస్పత్రి ఎదుట బంధువుల ఆందోళనకు అసలు కారణాలు ఏమిటి.?

★ 1.80 వేల రూపాయలు తీసుకొని సరైన వైద్యం చేయలేదని కుటుంబ సభ్యుల ఆందోళన

★ 15 రోజుల క్రితం వైద్యం కోసం ఆస్పత్రిలో చేరిన భూక్య మేనిబాయ్

★ బాధితుల తరఫున ఆస్పత్రికి మాట్లాడడానికి వచ్చిన ఒక రాజకీయ పార్టీ నాయకులపై దురుసుగా ప్రవర్తించిన ఆసుపత్రి సిబ్బంది

ఆర్మూర్( తెలంగాణ వార్త) ఏప్రిల్14 : ఆర్మూర్ పట్టణ కేంద్రంలోని ప్రైమ్ ఆశ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో గత 15 రోజుల క్రితం ఏర్గట్ల మండలం బట్టాపూర్ గ్రామానికి చెందిన భూక్య మేనిబాయ్ కాలుకు శస్త్ర చికిత్స చేసి రాడ్డు వేసిన వైద్యులు వారం రోజుల తర్వాత లక్ష 80 వేల రూపాయల బిల్లు వేసి ఇంటికి డిశ్చార్జ్ చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. అయితే రెండు రోజుల తర్వాత కాలు వాపు రావడంతో తిరిగి ఆస్పత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. మళ్లీ డ్రెస్సింగ్ చేస్తామని లోనికి తీసుకువెళ్లి రోగికి మత్తు ఇంజక్షన్ ఇచ్చి రెండవసారి కుటుంబ సభ్యులకి చెప్పకుండా ఆపరేషన్ చేశారని రోగి బంధువులు ఆరోపిస్తున్నారు. తీరా ఇప్పుడు వేసిన రాడ్డు సెప్టిక్ అయిందని, రక్తం గడ్డకట్టిందని వైద్యులు చెప్పారని తామేమి ఇప్పుడు చేయలేమని ఇంటికి తీసుకువెళ్లాలని వైద్యులు సూచించినట్లు బాధితులు ఆరోపిస్తున్నారు. నిరుపేదలైన తమ వద్ద డబ్బులు లాక్కొని సరైన వైద్యం అందించలేదని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయంలో బాధితులు తరఫున ఆసుపత్రి వైద్యులతో మాట్లాడడానికి ఆసుపత్రికి వచ్చిన ఒక రాజకీయ పార్టీకి చెందిన నాయకులపై ఆసుపత్రి సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. దుర్భాషలాడుతూ రోగి బంధువులను వారి తరఫున వచ్చిన వారిని బయటకు వెళ్లిపోవాలని మీడియా సభ్యుల ముందు దుర్భాషలాడుతూ దూషించిన వైనం. ఈ విషయంపై జిల్లా కలెక్టర్, జిల్లా వైద్యాధికారి వెంటనే చర్య తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు కోరుతున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఆర్మూర్ సబ్ కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన సీనియర్ జర్నలిస్ట్, తెలంగాణ వార్త,నిజామాబాద్ బ్యూరో. ఆర్మూర్...

జనరల్

మూడు నెలల తర్వాతే మున్సిపల్ ఎన్నికలు!

తెలంగాణ వార్త: తెలంగాణలో సంస్థగత ఎన్నికలు తోపాటు మున్సిపల్ ఎన్నికలు మూడు నెలల తర్వాత నిర్వహిస్తారని...

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

You cannot copy content of this page