Home జనరల్ రవీందర్ యాదవ్ కు కెసిఆర్ ప్రశంసలు. జన్మదిన సందర్భంగా కెసిఆర్ ఆశీస్సులు..
జనరల్

రవీందర్ యాదవ్ కు కెసిఆర్ ప్రశంసలు. జన్మదిన సందర్భంగా కెసిఆర్ ఆశీస్సులు..

రవీందర్ బాగున్నావా..? మీ కార్యక్రమాలు బాగున్నాయి..

మంచి భవిష్యత్ ఉంది.. ప్రజల్లో ఉంటూ సమస్యలపై పోరాటం చేయు

భారాస సీనియర్ నేత రవీందర్ యాదవ్ కు కేసీఆర్ ప్రశంసలు

జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేసీఆర్ ను కలిసిన రవీందర్ యాదవ్

కష్టపడిన ప్రతివారికి పార్టీలో గుర్తింపు దక్కుతుందని హామీ

శేర్లింగంపల్లి, తెలంగాణ వార్త:: భారాస అధినేత కేసీఆర్ ను శేరిలింగంపల్లి యువనేత రవీందర్ యాదవ్.. తన జన్మదినం సందర్భంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా రవీందర్ యాదవ్ ను కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాలు చాలా బాగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. రవీందర్ యాదవ్ కు బర్త్ డే విషెస్ తెలిపి, శాలువాతో కేసీఆర్ సన్మానించారు. రవీందర్ యాదవ్ కు మంచి భవిష్యత్ ఉందని, తెలంగాణ ఉద్యమంలో పోరాడిన విధంగా ముందుకు వెళ్లాలని సూచించారు. పార్టీ కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొంటున్న తీరును, శేరిలింగంపల్లిలోని పార్టీ వివరాలను కేసీఆర్ అడిగి తెలుసుకున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందు ఉండటంపై కేసీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. పార్టీ కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని సూచించినట్లుగా రవీందర్ యాదవ్ తెలిపారు. కష్టపడి పని చేసే వారికి పార్టీలో సరైన గుర్తింపు లభిస్తుందని కేసీఆర్ వెల్లడించారన్నారు. ప్రతి ఏడాది లాగే తమ అధినేత కేసీఆర్ ను కలిసి, తన జన్మదినంను జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. శేరిలింగంలపల్లిలో ఎంత మంది నేతలు పార్టీని వీడిన వచ్చిన నష్టమేమి లేదని రవీందర్ యాదవ్ అన్నారు. అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో శేరిలింగంపల్లిలో పార్టీని గెలిపిస్తామని, ప్రజల తరుపున పోరాటం కొనసాగిస్తామని వెల్లడించారు. త్వరలోనే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయనున్నట్లు రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

కుల గణణ పై హయత్ నగర్ సర్కిల్ లో ప్రశంసల జల్లు కురిపించిన అధికారులు..

తెలంగాణ వార్త::: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ,...

జనరల్

గల్ఫ్ ఏజెంట్ ప్రసాద్ ఎదురు తిరగడంతో టీవీ9 రాజేష్ లాల్ గుండెపోటుతో మృతి..

గుండెపోటుతో సీనియర్ జర్నలిస్ట్ రాజేష్ లాల్ మృతి.. -అతని కుమారుడని యూరప్ పంపిస్తానని మోసం చేసిన...

జనరల్

భారీగా ఐపీఎస్ ల బదిలీలు..

తెలంగాణ వార్త:: రాష్ట్రంలో అతిత్వరలో భారీగా ఐపీఎస్‌ల బదిలీలు జరుగనున్నాయి. ఈ మేరకు ఉన్నతాధికారులు జాబితాపై...

జనరల్

ఈనెల చివరి నుంచి రైతు భరోసా…

తెలంగాణ వార్త::రైతు భరోసా కింద ఎకరాకు రూ.7,500 పెట్టుబడి సాయం పంపిణీపై తెలంగాణ ప్రభుత్వం కీలక...

You cannot copy content of this page