Home జనరల్ రెవెన్యూలో మళ్లీ వీఆర్వో ల పోస్టులు. మంత్రి పొంగులేటి….
జనరల్

రెవెన్యూలో మళ్లీ వీఆర్వో ల పోస్టులు. మంత్రి పొంగులేటి….

హైదరాబాద్, తెలంగాణ వార్త:: రాష్ట్రంలో మళ్లీ వీఆర్‌వో, వీఆర్‌ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి.. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు.
రాష్ట్రంలో మళ్లీ వీఆర్‌వో, వీఆర్‌ఏల సేవలను వినియోగించుకోనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి తెలిపారు. రెవెన్యూ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసి.. సామాన్యుడికి అందుబాటులో ఉండేలా తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామని, కొత్త రెవెన్యూ చట్టం రాకముందే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఆదివారం రాష్ట్రంలోని 272 మంది స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కల్లెక్టర్లు, డిప్యూటీ కల్లెక్టర్లతో ఎంసీఆర్‌హెచ్‌ఆర్డీఐలో మంత్రి పొంగులేటి ముఖాముఖి సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత ప్రభుత్వం తొందరపాటు నిర్ణయాలతో రెవెన్యూ వ్యవస్థను భ్రష్టు పట్టించిందని, సామాన్యులకు రెవెన్యూ ేసవలను దూరం చేసిందని ఆరోపించారు. మళ్లీ అలాంటి పరిస్థితి పునరావృతం కాకుండా ఉద్యోగులను, మేధావులను సంప్రదించి వారి సూచనలు, సలహాలు స్వీకరించామన్నారు. తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టాన్ని దేశానికి రోల్‌ మోడల్‌గా ఉండేలా తీసుకువస్తున్నట్టు తెలిపారు. గత ప్రభుత్వం అమలు చేసిన ధరణితో ఎదురైన కష్టాల నుంచి విముక్తి కల్పించేలా దీనిని రూపొందిస్తున్నట్టు పేర్కొన్నారు. కొత్త చట్టానికి సంబంధించి నల్లగొండ జిల్లాలోని తిరుమలగిరి, రంగారెడ్డి జిల్లాలోని యాచారం మండలాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌ చేపడుతున్నట్లు చెప్పారు. ప్రభుత్వ భూముల రికార్డులు టాంపరింగ్‌కు గురికాకుండా డిజిటలైజేషన్‌ చేయనున్నట్టు ప్రకటించారు.

ఉద్యోగులందరికీ శిక్షణ..

కొత్తగా ఉద్యోగంలో చేరిన వారితోపాటు సర్వీసులో ఉన్న ప్రతి ఒక్కరికీ శిక్షణ ఇస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు. ఉద్యోగులకు జాబ్‌ చార్ట్‌ రూపొందించాలని, దీనిపై కమిటీని ఏర్పాటు చేసి ఇతర రాష్ట్రాల్లోని విధానాలను అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. ఉద్యోగుల సంబంధించి పదోన్నతుల వంటి ఆర్థికేతర సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామన్నారు. ఇక రాష్ట్రంలోని 33 జిల్లాల్లో సెలక్షన్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్‌ పోస్టులను కొత్తగా తీసుకువస్తామని, అలాగే 17 మంది సీనియర్‌ అదనపు కలెక్టర్‌ క్యాడర్‌ అధికారులకు ఐఏఎస్‌ హోదా కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎన్నికల సమయంలో బదిలీ అయిన తహసీల్దార్‌లను పూర్వ స్థానాలకు బదిలీ చేయడానికి దసరాలోపే నిర్ణయం తీసుకుంటామన్నారు.

వాహనాల అద్దెలను ఈ నెలాఖరు వరకు 50 శాతం క్లియర్‌ చేస్తామన్నారు. గత ప్రభుత్వం మండలాలు, రెవెన్యూ డివిజన్లు, జిల్లాలను పెంచింది తప్ప.. అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించలేదని మంత్రి ఆరోపించారు. దాదాపు 200 మండలాలకు సొంత భవనాలు లేవన్నారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌, హైదరాబాద్‌ కలెక్టర్‌ అనుదీప్‌ దురుశెట్టి, తెలంగాణ ేస్టట్‌ సివిల్‌ సర్వీసెస్‌ డిప్యూటీ కల్లెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు చంద్రమోహన్‌, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ రెడ్డి, కోశాధికారి భాస్కర్‌రావు, డిప్యూటీ కలెక్టర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లచ్చిరెడ్డి, ప్రధాన కార్యదర్శి రామకృష్ణ, ట్రెసా అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి గౌతమ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

అంగన్వాడీ టీచర్ల కోసం పోస్టుల జారీ.. 12 పాస్ అయితే చాలు..

పాలిచ్చే తల్లులకు పోషకాహారం✔ పిల్లలకు పూర్వ ప్రాథమిక విద్య మరియు ప్రారంభ అభ్యాస మద్దతు✔ ఆరోగ్య పరీక్షలు మరియు...

జనరల్

శేర్లింగంపల్లి ని ముందుండి నడిపిస్తా డా* రవీందర్ యాదవ్..

రవీందర్ యాదవ్ కు ఎమ్మెల్సీ కవిత అభినందనలు పార్టీ కార్యక్రమాలను విజయవంతం చేయడంపై ప్రశంసలు అనుచరులతో...

జనరల్

క్షత్రియ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఉప్పల్ లో క్షత్రియ సమాజ్ భవన్ లో నిర్వహణ..

తెలంగాణ వార్త:::శ్రీ సోమవంశియ సహస్రర్జున క్షత్రియ (పట్కరి/ఖత్రి) ప్రాంతీయ సమాజ్ గత వారం నూతన కమిటీని...

జనరల్

సమాచార హక్కు చట్టం… రామబాణం.. న్యాయవాది ఘటడి ఆనంద్..

తెలంగాణ వార్త:::ఆర్మూర్ : పట్టణంలోని రాంమందిర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థి, విద్యార్థులకు న్యాయవాది గటడి ఆనంద్...

You cannot copy content of this page