మోహన్ దోండి 9440023558
*రోడ్ నిర్మాణం పనులు చేపట్టాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్*
జగిత్యాల్, తెలంగాణ వార్త:: జగిత్యాల జిల్లా రూరల్ మండలం కండ్లపల్లి, గ్రామానికి వెళ్ళే దారిలో ఉన్నటువంటి రైతు చౌరస్తా వద్ద రోడ్డు పూర్తిగా చెడి పోవడం తో వర్షపు నిరు చేసి బురదగా మారడంతో ప్రమాదాలకు అడ్డాగా మారింది జగిత్యాల నుండి రాయికల్ నిర్మల్ కు ఈ దారిలో అత్యధిక సంఖ్యలో వాహనాలు ఈ దారిలోనే వెళ్తాయి అలాగే అంబెల్స్ కూడా ఈ దారిలోనే వెళుతుంది కండ్లపల్లి గ్రామంలో మోడల్ స్కూల్ కూడా ఉండడం వలన అత్యధిక సంఖ్యలో వాహనాలు ఈ దారిలోనే వెళ్తూ ఉంటాయి అలాంటి ఈ రోడ్డు పూర్తిగా చెడిపోవడంతో నిరంతరం ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ దారి నుండి వెళ్లే ఆటోలు కూడా రోడ్డు వలన రిపేరు కావడంవల్ల ఆటో డ్రైవర్లకు 3000 నుండి 5000 వరకు రిపేర్లకి ఖర్చులు అవుతున్నాయని వచ్చే ఆటో కిరాయిలు డబ్బులు పూర్తిగా ఆటో రిపర్కే అవుతున్నాయి అలాగే స్కూల్ కి వెళ్లే చిన్న చిన్న పిల్లలకు ఈ దారి వలన గాయాలు కూడా అవుతున్నాయ్ రాత్రి సమయంలో ఈ రోడ్లో వెళ్లిన అనేకమంది రోడ్డు ప్రమాదం ద్వారా హాస్పిటల్ పాలయ్యారని అన్నారు నిరంతరం ఈరోజు నుండి వెళ్లే స్థానిక ఎమ్మెల్యే , సంజయ్ కుమార్ గారికి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారికి రోడ్డు కనబడట్లేదా అని ప్రశ్నించారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ ప్రభుత్వం లాగా కాంగ్రెస్ ప్రభుత్వం చేయొద్దని రోడ్డు పనులు వెంటనే చేపట్టి ప్రమాదాలు గురికాకుండా చర్యలు చేపట్టాలని స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మరియు ప్రజా ప్రతినిధులకు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నామన్నారు రోడ్డు పనులు చేపట్టని యెడల పరిసర గ్రామాల ప్రజలను చైతన్యం చేసి కలెక్టర్ ముట్టడికి పిలిపిస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో యంయస్పి జిల్లా అధ్యక్షులు దూమల గంగారాం ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సురుగు శ్రీనివాస్ జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ ఉపాధ్యక్షులు బోణగిరి కిషన్ సీనియర్ నాయకులు దుమల గంగారాం నియోజకవర్గ కో ఇన్చార్జి బోడేటి సునీల్ స్థానిక గ్రామాల ప్రజలు ఆటో డ్రైవర్లకు తదితరులు పాల్గొన్నారు
Leave a comment