Home జనరల్ శ్రీచైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి…
జనరల్

శ్రీచైతన్య కార్పొరేట్ విద్యాసంస్థలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి…


సాత్విక్ మరణానికి కారణమైన కృష్ణారెడ్డి, ఆచార్య, శోభన్ ,నరేష్ లపై క్రిమనల్ కేసులు నమోదుచేసి వెంటనే అరెస్టు చేయాలి.
విద్యార్థుల హత్యలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి.బట్టు శ్రీధర్(భారతీయ విద్యార్థి మోర్చా- రాష్ట్ర అధ్యక్షులు)

నిజామాబాద్ (తెలంగాణ వార్త) హైదరాబాద్ నార్సింగి శ్రీచైతన్య జూనియర్ కాలేజ్ లో యాజమాన్యం పెడుతున్న ఒత్తిడినీ తట్టుకోలేక విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
శ్రీ చైతన్య మరియు నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల ఆత్మహత్యలకు నిలయాలుగా మారాయని విచ్చలవిడిగా ఫీజులను వసూలు చేస్తూ విద్యను వ్యాపారం చేస్తున్నారు.పరీక్షల పేరుతో, మార్కుల పేరుతో… ఇతర విషయాల పేరుతో విద్యార్థులను మానసికంగా వేధిస్తున్నారు. మొన్న రమాదేవి… నేడు సాత్విక్.. ఇలా ఎందరినో బలి తీస్కుంటుంది ఈ శ్రీచైతన్య కళాశాల.. వీరి ఆగడాలను తట్టుకోక చనిపోవడం చాలా వేదనభరితమైనది, బాధాకరమైనది. విద్యార్థుల హక్కులను కాలరాస్తూ ఆత్మహత్యలకు నిలయాలుగా మారిన శ్రీ చైతన్య మరియు నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థలను వెంటనే మూసివేయాలి. మూసి వేసి అరెస్ట్ చేయాలి అని డిమాండ్ చేస్తున్నాము.

నిమ్మకునిరెత్తనట్టుగా చూస్తున్న ఇంటర్మీడియెట్ బోర్డ్ అధికారులు
శ్రీచైతన్య మరియు నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఎలాంటి నిబంధనలు పాటించకున్న, ఇలాంటి ఘటనలు తరచుగా జరుగుతున్న కానీ కనీస చర్యలు తీసుకోకుండా చోద్యం చూస్తున్న ఇంటర్మీడియట్ బోర్డ్ అధికారులు… వారి స్పందన తీరు సిగ్గుచేటు. ఎన్నో కళాశాలల్లో ఇలాంటివి జరిగినప్పటికీ అలాగే కనీసం వసతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే ఏ ఒక్క కళాశాల మీద చర్యలు తీస్కుకోలేదు. ఈ కార్పొరేట్ విద్యాసంస్థలతో పాటు ప్రభుత్వ అధికారులు కార్పొరేట్ అయ్యారు అనడానికి ఇదే ఒక ఉదాహరణ. ఇప్పటికైనా అటు అధికారులు ఇటు ప్రభుత్వం శ్రీచైతన్య మరియు నారాయణ కార్పొరేట్ విద్యాసంస్థల పైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. లేని యెడల రాష్ట్రంలో జరిగే ఉద్యమాలకు శాంతిభద్రతలకు ప్రభుత్వం బాధ్యత వహించాలి అని హెచ్చరిస్తున్నాము.

9440023558

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

పెర్కిట్ వద్ద వాహనం ఢీ ఒకరి మృతి..

ఆర్మూర్, తెలంగాణ వార్త: ఆదివారం ఉదయం 6:10 గంటలకు, NH44 లోని రిలయన్స్ పెట్రోల్ పంప్...

జనరల్

బీటీ రోడ్డుకు శంకుస్థాపన చేసిన పైడి రాకేష్ రెడ్డి..

ఆర్మూర్, తెలంగాణ వార్త:: డొంకేశ్వర్ మండలం లో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి సోమవారం డొంకేశ్వర్...

జనరల్

తగ్గేదే లే దన్న కమిషనర్ సి డి ఎం ఏ కు సరెండర్ అయినా మేనేజర్..

ఆర్మూర్ తెలంగాణ వార్త:: ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్ మేనేజర్ మధ్య చెలరేగిన చిచ్చులో...

జనరల్

ఓవర్ ఆల్ గా తప్ప లిఖితపూర్వకంగా ఫిర్యాదు అందలేదు సి.డి.ఎం.ఏ డైరెక్టర్..

తెలంగాణ వార్త:: నిజాంబాద్ జిల్లాలోని ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ రాజు కు మేనేజర్...

You cannot copy content of this page