తెలంగాణ వార్త: ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీ స్వచ్ఛతకు, సమైక్యతకు ఆదర్శంగా జర్నలిస్ట్ కాలనీ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ తెలిపారు. ఆర్మూర్ జర్నలిస్ట్ కాలనీలో అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ ఆద్వర్యంలో ఆదివారం స్వచ్ఛ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహించారు. కాలనీవాసులు శ్రమదానంతో రోడ్ నెంబర్ తొమ్మిదిలో పిచ్చి మొక్కలను, చెత్తాచెదారాన్ని తొలగించారు. మురుగు కాలువలలో నీటి ప్రవాహానికి అడ్డుగా నిలిచిన ప్లాస్టిక్ కాగితాలను చెత్తను తొలగించి శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ ఇళ్ళ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కాలనీ వాసులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కాలనీ అధ్యక్షుడు గోసికొండ అశోక్ మాట్లాడుతూ గత తొమ్మిది వారాలుగా ప్రతి ఆదివారం రెండు గంటలు అనే నినాదంతో స్వచ్చ కాలనీ సమైక్య కాలనీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. హనుమాన్ ఆలయ కమిటి అధ్యక్షుడు పుప్పాల శివరాజ్ కుమార్ మాట్లాడుతూ కాలనీ అధ్యక్షుడు అశోక్ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహిస్తూ కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుతున్నారని అభినందించారు. కాలనీ అభివృద్ధి కమిటీ ప్రధాన కార్యదర్శి బి.కమలాకర్, ఉపాధ్యక్షులు కొక్కెర భూమన్న సుంకె శ్రీనివాస్, కార్యదర్శులు కొంతం రాజు, లొచారం సాయన్న, ఘనపురం సంతోష్ ఎస్సారెస్పీ డీ ఈ గణేశ్ ఎల్ టి కుమార్, ఎర్ర భూమయ్య, మంచిర్యాల కిషన్, శ్రీరాం రమణయ్య, బాలు, మారుతి, భాజన్న తదితరులు పాల్గొన్నారు.
Leave a comment