నిజాంబాద్ (తెలంగాణ వార్త) టి ఎస్ పి ఎస్సీ పేపర్ య .సి వర్కింగ్ ప్రెసిడెంట్ రమావత్ లాల్ సింగ్. టీ.యస్.పి.యసి నిర్లక్ష్యంతోనే పేపర్ లీక్ దాన్ని కప్పిపుచ్చుకోవాలనే ఉద్దేశంతో హాకింగ్ అని లీకులు ఇచ్చారని తెలంగాణ విద్యార్థి ఉద్యమ వేదిక రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, రమావత్ లాల్ సింగ్ ఒక ప్రకటనలో ఆరోపించారు. లక్షల మంది విద్యార్థులు, నిరుద్యోగుల జీవితాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. వ్యక్తిగత అవసరాల కోసం టీఎస్పీఎస్సీ కార్యదర్శి పీఏ ప్రవీణ్ పేపర్ లీక్ చేసే దుస్థితికి టీఎస్పీఎస్సీని కేసీఆర్ ప్రభుత్వం దిగ జారిందని మండిపడ్డారు. టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ (టీపీఓ) పేపర్ లీక్ ఘటన వెనుక ప్రవీణ్ కుమార్, టీఎస్ పీఎస్సీ మాజీ సభ్యుని పాత్ర, టీఎస్ పీఎస్సీ చైర్మెన్ జనార్దన్ రెడ్డి, కార్యదర్శి అనిత రామచంద్రన్ తో పాటు సభ్యుల అందరి మీద విచారణ జరిపించాలని, బాధ్యులను కఠినంగా శిక్షించాలని రమావత్ లాల్ సింగ్ డిమాండ్ చేశారు. రహస్యంగా పారదర్శకంగా, ఉండే సమాచారాన్ని ఒక సాధారణ ఉద్యోగి ఎట్లా లీక్ చేస్తాడని దీని వెనుక టీఎస్పీఎస్సీ చైర్మెన్ తో పాటు రాష్ట్ర ప్రభుత్వ పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. మానిటర్ చైర్మెన్ పాత్ర మీద నిరుద్యోగులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ ఘటన మీద సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్నారు. లేని పక్షంలో విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి టీఎస్పీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
Leave a comment