Home జనరల్ వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా..
జనరల్

వాహన చోదకులకు ట్రాఫిక్ పోలీసుల జరిమానా..

తెలంగాణ వార్త:: వాహన చోదకులు ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘిస్తే ఇప్పటి వరకూ ఆ వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు చలనా (జరిమానా) వేస్తున్నారు. అయితే వాహనదారులు చెక్ చేసుకుంటేనో..లేక ఎక్కడైనా వాహనాల తనిఖీ సమయంలో పోలీసులు నిలుపుదల చేసిన సమయంలో ఎన్ని చెలాన్లు పెండింగ్లో ఉన్నాయో.. ఎంత చెల్లించాలో తెలిసేది. తమ వాహనంపై ఎన్ని చెలాన్లు ఉన్నాయో తెలియకపోవడంతో వాహనదారులు వాటిని చెల్లించడం లేదు. దీంతో చెలాన్ల సంఖ్య భారీగా పెరిగిపోతూ ఉంది.
ఈ నేపథ్యంలో రవాణా శాఖ చలనాల చెల్లింపులకు కొత్త ప్రతిపాదన సిద్దం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ట్రాఫిక్ నియమాలు అతిక్రమించిన సందర్భంలో నేరుగా వాహనదారుడి మొబైల్ నెంబర్ కు ట్రాఫిక్ చలాన్ లు పంపించడంతో పాటు వాటిని సులభతరంగా చెల్లింపులకు కూడా గుగుల్ పే, ఫోన్ పే, పేటీఎం, భీమ్ యాప్, యూపీఐ అప్షన్స్ కల్పించాలని అధికారులు ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నారుట. వాహన దారుల చలాన్ జరిమానాలు పెద్ద ఎత్తున పెండింగ్ లో ఉండటం వల్ల ప్రభుత్వ ఆదాయానికి గండిపడుతోంది.
దీంతో ఈ కొత్త వ్యవస్థను తీసుకువస్తే ప్రభుత్వానికి ఆదాయం పెరిగే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. అయితే ఇది ప్రయోగాత్మక దశలోనే ఉంది. అయితే ఈ వ్యవస్థను ముందుగా కొన్ని నగరాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని రవాణా శాఖ యోచిస్తున్నట్లు సమాచారం. టాఫిక్ నియమాలు ఉల్లంఘించిన వాహనదారులకు నేరుగా వాట్సాప్ లేదా మెసేజ్ రూపంలో చలానా పంపే విధానం తీసుకువస్తే వాహనదారులకు చెల్లింపులు సులభతరం అవుతాయని తద్వారా ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page