భైంసా తెలంగాణ వార్త ; మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి వెంటే నడుస్తానని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవీకి త్వరలోనే రాజీనామా చేస్తానని డీసీసీ అధ్యక్షులు ముత్యంరెడ్డి వెల్లడించారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం న్యూఢిల్లీలో బీజేపీలో చేరిన సందర్భంగా నిర్మల్ లో విలేఖరులతో మాట్లాడారు. తాను కాంగ్రెస్ అధ్యక్ష పదవీకి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి త్వరలోనే బీజేపీలో చేరుతానని స్పష్టం చేశారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని ఆయా మండలాల కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులందరూ సైతం ఏలేటి వెంటే నడువనున్నారని వెల్లడించారు. వారందరూ కూడా కాంగ్రెస్ కు రాజీనామా చేసి బీజేపీలో చేరుతారని స్పష్టం చేశారు. ఏలేటి మహేశ్వర్ రెడ్డి న్యూఢిల్లీ నుండి నిర్మల్ కు చేరుకోగానే వారి సూచనలు, సలహాలు, ఆదేశాలకు అనుగుణంగా తామందరూ పయనిస్తామని పేర్కొన్నారు.
Leave a comment