ఎల్బీనగర్ తెలంగాణ వార్త ఎల్.బి. నగర్ జోనల్ కమిషనర్ శ్రీమతి ఎస్ పంకజ హయత్ నగర్ సర్కిల్ లెవెల్ కన్వర్జెన్స్ మీటింగ్ కార్పొరేటర్లు, జి.హెచ్.యం.సి అధికారులు మరియు ఇతర శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు
- డిసిల్టింగ్ వర్క్స్
రానున్న వర్ష కాలం దృష్టిలో పెట్టుకొని నాలల వద్ద డిసిల్టింగ్ వర్క్స్ జరుగుతున్నాయి. అట్టి పనుల్లో కార్పొరేటర్లుకు సమాచారం ఇచ్చి వారిని కూడా బాగస్వామ్యులు చేయాలని ఆదేశించారు. - నాల ఆడిట్
ఎల్.బి. నగర్ జోన్లో ఉన్న నాలల పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాటి యొక్క పనులను పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు.
రానున వర్ష కాలం దృష్టిలో ఉంచుకుని కార్పొరేటర్లు అందరూ సర్కిల్ పరిధిలో జరుగుతున్న బాక్స్ డ్రైన్ మరియు కల్వర్టు పనులు వేగవంతం చేయాలని కోరారు.
డిసిల్టింగ్ పనులు చేసిన వెంటనే కార్టింగ్ మెటీరియల్ తొలిగించాలని కోరారు.
కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు చెట్లు కోట్టి రోడ్ల పైన వదిలేయడం జరుగుతుంది. దాని వలన రోడ్డుపై చెత్త పెరుకుపోతుంది. కావున వాటిని వెంట వెంటనే తొలిగించాలి అని కోరారు.
సర్కిల్లో జరుగుతున్న అక్రమ నిర్మాణాలు వెంటనే తొలిగించాలి అని కోరారు.
డివిజన్ జరుగుతున్న పనులు మరియు జరగాల్సిన పనులను వేగవంతం చేయాలని కోరారు.
ఈ సమావేశంలో కార్పొరేటర్లు శ్రీమతి సిహెచ్ అరుణ, నాగోల్ శ్రీ. కొప్పుల నరసింహారెడ్డి, మన్సూరాబాద్, శ్రీ. కళ్లెం నవ జీవన్ రెడ్డి, హయత్ నగర్, శ్రీ. మొద్దు లచ్చి రెడ్డి, బి ఎన్ రెడ్డి నగర్, శ్రీ. వి. అశోక్ రెడ్డి, ఎస్.ఈ, శ్రీ. బి. ప్రసాద్ రావు, సీపీ, శ్రీ. రాజ్ కుమార్, డిడి (యుబిడి), శ్రీ. విద్య సాగర్, ఈఈ (ఎలక్ట్రికల్), డిప్యూటీ కమిషనర్ శ్రీ. ఎ. మారుతీ దివాకర్, ఇంజనీరింగ్ అధికారులు, వాటర్ వర్క్స్ అధికారులు, కరెంటు డిపార్ట్మెంట్ అధికారులు, ట్రాఫిక్ మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు.
Leave a comment