ఆర్మూర్, తెలంగాణ వార్త :ఆర్మూర్ MLA ,PUC చైర్మన్, TRS పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవన్ రెడ్డి గారి ఆదేశానుసారం నియోజకవర్గ ఇంచార్జి రాజేశ్వర్ రెడ్డి గారి సూచనతో ఆర్మూర్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కేంద్ర బీజేపీ ప్రభుత్వ మోడీ దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది.. ఇట్టి సందర్భంగా TRS సీనియర్ నాయకులు పోల సుధాకర్, పండిత్ ప్రేమ్, సుమీర్ హైమద్, పృత్వి మాట్లాడుతూ, దేశంలోని నిరుపేద మధ్యతరగతి ప్రజలపై టాక్స్ లు, భాది భాది సంపాదించిన సొమ్ముతో తెలంగాణలోని TRS పార్టీకి చెందిన MLA లను వందల కోట్ల రూపాయలతో కొనుగోలు చేయాలని భావించిన బీజేపీ కుట్రలను తీవ్రంగా ఖండించారు,
ఒక దిక్కు తెలంగాణలో జరుగుతున్న ఉప ఎన్నికల్లో TRS పార్టీ మిషన్ మునుగొడుతో ప్రజల హృదయాలను సొంతం చేసుకోవడం జీర్ణించుకోలేని బేవర్స్ బీజేపీ నాయకులు ఆపరేషన్ ఆకర్ష్ చేయడం సిగ్గుచేటని అన్నారు.ఇట్టి వ్యవహారంలో పాత్రధారులు దొరికినారు అతిత్వరలో సూత్రధారులు కూడా అరెస్టు అవుతారని తెలిపినారు. ఇట్టి కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్లు గంగమోహన్ చకృ, ఇంతియాజ్ అలీ, మురళీధర్ రెడ్డి, అథిక్,
తాటి హన్మాండ్లు,రింగుల భూషణ్, డీసీసీబీ డైరెక్టర్ వాసు, TRSY పట్టణ అధ్యక్షుడు పృత్వి, సీనియర్ నాయకులు జనార్దన్ గౌడ్,అంజగౌడ్,జిజి రామ్, సడక్ వినోద్,ఉస్మాన్ హజ్రమి,మీరా హన్మాండ్లు, శ్రవణ్,షాహిద్, కొక్కెర భూమన్న, వెన్న రమేష్, అల్లకొండ హరీష్, లతీఫ్,నాగరాజు,నరేష్, తదితరులు పాల్గొన్నారు..
Leave a comment