ఆర్మూర్ లో పర్యటించిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్.
-పార్థసారథిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు.
ఆర్మూర్ తెలంగాణ వార్త క్లాస్ మేట్ అని అడుగుతున్నాడు} మార్చి12 : రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి.పార్థసారథి శనివారం ఆర్మూర్ లో పర్యటించారు. హైదరాబాద్ నుండి నేరుగా ఆర్మూర్ కు చేరుకున్న ఆయన ముందుగా స్థానిక రోడ్లు భవనాల శాఖ అతిథిగృహంలో జిల్లా అధికారులతో భేటీ అయ్యారు. జిల్లా పంచాయతీ అధికారి జయసుధ, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి గోవింద్, ఆర్డీవో శ్రీనివాస్ తదితరులు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కు స్వాగతం పలికి, ఆయనతో సమావేశం లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో వివిధ కారణాల వల్ల ఆయా గ్రామ పంచాయతీల పరిధిలో ఖాళీ అయిన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాల గురించి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరా తీశారు. జిల్లాలో మొత్తం 8 సర్పంచ్, 15 ఉప సర్పంచ్, 120 వార్డు సభ్యుల స్థానాలు, ఒక ఎంపీటీసీ స్థానం ఖాళీగా ఉన్నాయని జిల్లా పంచాయతీ అధికారి జయసుధ కమిషనర్ దృష్టికి తెచ్చారు. ప్రభుత్వం నుండి అనుమతి వచ్చిన మీదట వీటి భర్తీ కోసం నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నందున ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకుని ఎన్నికల నిర్వహణకు సమాయత్తం అయి ఉండాలని అధికారులకు కమిషనర్ సూచించారు.
కాగా, రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి పెర్కిట్ కు చెందిన నారాయణరెడ్డిని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. వ్యవసాయ కళాశాలలో చదువుతున్న సమయంలో సహచర విద్యార్థిగా ఉన్న పొద్దుటూరి నారాయణరెడ్డి మాతృమూర్తి పొద్దుటూరి కాంతమ్మ ఇటీవలే స్వర్గస్థులయ్యారు. ఈ నేపథ్యంలో మాతృవియోగానికి లోనైన నారాయణరెడ్డిని కమిషనర్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు ఆర్ అండ్ బి అతిథి గృహంలో కమిషనర్ పార్థసారథిని ఆర్మూర్ ప్రెస్ క్లబ్ ప్రతినిధులు, స్థానిక జర్నలిస్టులు ఘనంగా సత్కరించారు.
Leave a comment