ఆర్మూర్ ,తెలంగాణ వార్త:. ఆర్మూర్ పట్టణంలోని, బుధవారం రోజు పెర్కిట్ లో 20వ వార్డులో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు మున్సిపల్ సిబ్బంది ,ఆశా వర్కర్లు ఆర్ పి, కలిసి 20వ వార్డులో మున్సిపల్ పెర్కిట్ బిల్ కలెక్టర్ చెన్న గంగా మోహన్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ కుటుంబ సభ్యుల వివరాలు వారి పేర్లను నమోదు చేయడం జరిగిందని తెలిపారు అదే విధంగా కుటుంబంలో సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని కాలనీవాసులకు జరం బిపి షుగర్ దగ్గు సర్ది వంటి దీర్ఘకాలిక వ్యాధుల పట్ల బాధపడుతున్న వారికి గుర్తించి వారికి మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల భారీగా కురిసిన వర్షాల వల్ల ప్రజలకు సీజన్లో వచ్చే వ్యాధుల పట్ల అవగాహన కల్పించాలని మున్సిపల్ సిబ్బంది మరియు మండల వైద్యశాఖ సిబ్బంది కలిసి సర్వే నిర్వహించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో వైద్యశాఖ సిబ్బంది అరుణ కవిత,. ఆర్పి.లలిత,. మున్సిపల్ సిబ్బంది ఇంటింటికి తిరుగుతూ ఫీవర్ సర్వే నిర్వహించడం జరిగింది.
Leave a comment