(తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలోని 36 లక్షల మంది నిరుద్యోగుల తరపున ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి గ్రూప్ 1 మరియు ఇతర పరీక్షలను రద్దు చేయించేలా పోరాటం చేపట్టిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డా.ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ గారి పోరాటానికి మద్ధతుగా బుధవారం ప్రారంభం అయిన దీక్ష ఈ రోజు ఉదయం 11 గంటలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం అక్కడే జిల్లా అధ్యక్షులు Er మోహన్ గారికి పార్టీ శ్రేణులు నిమ్మరసం తాగించి దీక్షను విరమింపజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు దీక్ష మాత్రమే విరమిస్తున్నం, కానీ TSPSC లీకేజీల మీద పోరాటాన్ని కాదని అన్నారు. TSPSC బోర్డ్ రద్దు చేసి, నూతన కమిటీ నియమించి ,కేసును సీబీఐ కి అప్పగించి నిరుద్యోగులకు న్యాయం చెసే వరకు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతు పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఇంచార్జి లింగంపల్లి యాదగిరి గారు,జిల్లా ఉపాధ్యక్షులు ఓం ప్రకాష్ గారు, జిల్లా కోశాధికారి రోమాల బాబు గారు, సిద్దిపేట జిల్లా కార్యదర్శులు మంద పాండు, బాకురి అశోక్, గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జి కొండనోళ్ళ నరేష్గారు,,అనాజిపూర్ సంజీవ్ గార్లు,జిల్లా EC మెంబెర్ చిట్యాల శ్రీను గారు,దుబ్బాక అసెంబ్లీ అధ్యక్షులు జింక సంజీవులు గారు,గజ్వేల్ అసెంబ్లీ ఉపాధ్యక్షులు గుర్రం ఎల్లం గారు,గజ్వేల్ టౌన్ అధ్యక్షులు కోట మహేందర్ గారు, కుకునూర్ పల్లి మండల అధ్యక్షులు ఆశని కనక ప్రసాద్ గారు,వివిధ అసెంబ్లీ కమిటీ నాయకులు, మండల,సెక్టార్ నాయకులు పాల్గొన్నారు.
Leave a comment