75 సంత్సరాల స్వాతంత్ర భారతంలో అంటరానితనం, కులనిర్మూలన అరికట్టడంలో పాలకుల విఫలం.
కనక ప్రమోద్ మాదిగ
MRPS నిజామాబాద్ జిల్లా కన్వీనర్
వేల్పూర్, తెలంగాణ వార్త:: More అధినేత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు నిజామాబాద్ జిల్లా, వేల్పూరు మండల కేంద్రం తహశీల్దార్ కార్యాలయం వద్ద MRPS నాయకులు బోయుడి శ్రావణ్ మాదిగ ఆధ్వర్యంలో రాజస్థాన్ రాష్ట్రంలో దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెగ్వల్ హత్యను ఖండిస్తూ అంబేడ్కర్ చౌరస్తా నుంచి MRO ఆఫీస్ వరకు నిరసన ప్రదర్శన చెయ్యడం జరిగింది.. అనంతరం వేల్పూరు మండల డిప్యూటీ తహశీల్దార్ గారికి మెమొరాండం ఇవ్వడం జరిగింది..
ఈ నిరసన కార్యక్రమంలో MRPS జిల్లా కన్వీనర్ కనక ప్రమోద్ మాదిగ పాల్గొని మాట్లాడుతు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అంటరానితనం,అణచివేత నిర్ములన కోసం కృషి చేయకపోవడం సిగ్గుచేటు అని మండిపడ్డారు. 75 యేండ్ల వజ్రోత్సవ ఉత్సవాలు చేసుకుంటున్న మన దేశంలో నీళ్లు త్రాగాడనే కారణంగా దళిత విద్యార్థిని ఉపాధ్యాయుడు హత్య చేయడాన్ని తీవ్రంగా కండిస్తున్నట్లు తెలిపారు. దళిత విద్యార్థి ఇంద్ర కుమార్ మెఘ్వల్ మరణానికి కారణం అయిన అగ్రకుల అహంకారి టీచర్ ను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా విద్యార్ది కుటుంబానికి కోటి రూపాయల ఎగ్సిగ్రేషియ ప్రకటించాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో MRPS బాల్కొండ నియోజకవర్గ నాయకుడు కండె క్రాంతి మాదిగ, MRPS మండల నాయకులు బోయిడి శ్రావణ్ మాదిగ, నల్లురి రాజు మాదిగ, వంశీ, రఘు, శ్వరన్ రాజ్, కార్తిక్, రాజు, హర్షిట్, రాజు, నితిన్ తదితరులు పాల్గొన్నారు.
Leave a comment