(తెలంగాణ వార్త) ఆర్మూర్ మార్చి 10: ఆర్మూర్ పోలీస్ స్టేషన్లో హోంగార్డుగా విధులు నిర్వహించే మ్యాదరి స్వామి తన ఫౌండేషన్ ద్వారా ఆపదలో రక్తం అవసరం ఉన్నవారికి రక్తం డొనేట్ చేయించి, ప్రాణదాతగా మారి ఆదర్శంగా నిలుస్తున్నారు. స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ కి రక్తం కొరకు ఫోన్ వచ్చిన వెంటనే స్పందించి రక్తదాతల ద్వారా రక్తం సేకరించి కేశ్ పల్లి గ్రామానికి చెందిన కే బుజ్జీ కు ఓ నెగెటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన శైలజ కు ఓ పాజిటివ్ రక్తం, పాలెం గ్రామానికి చెందిన లతిక కు ఏ పాజిటివ్ రక్తం, ఆర్మూర్ కు చెందిన పూజితకు బి పాజిటివ్ రక్తం, ముక్కాల్ మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన అరుణ్ కు ఓ పాజిటివ్ రక్తందాతల ద్వారా సమకూర్చారు. ఈ సందర్భంగా రక్తం దాతలైన ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీకి చెందిన కే ఆత్మ చరణ్, మామిడిపల్లి గ్రామానికి చెందిన మేడిదల క్రాంతి గౌడ్, గోవింద్ పెట్ గ్రామానికి చెందిన పల్లికొండ రాజేష్, ఆర్మూర్ పట్టణానికి చెందిన పి రాఘవేంద్ర, ఆర్మూర్ కు చెందిన కే గణేష్ లకు స్వామి బాయ్ బ్లడ్ ఫౌండేషన్ తరపున మాధరి స్వామి ధన్యవాదాలు తెలిపారు.
9440023558
Leave a comment