Home జనరల్ మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు.
జనరల్

మహబూబ్ నగర్ – రంగారెడ్డి – హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయని జిల్లా కలెక్టర్ ఎస్.హరీష్ తెలిపారు.

 

    హైదరాబాద్ (తెలంగాణ వార్త) సోమవారం జిల్లాలో జరిగిన మహబూబ్ నగర్ – రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 86.9 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు హరీష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటల వరకు 15.2  శాతం పోలింగ్ నమోదయిందని, 12 గంటల వరకు 43.8 శాతం పోలింగ్ నమోదయిందని, మధ్యాహ్నం 2 గంటలు 65.5 శాతం పోలింగ్ నమోదయిందని, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తయి 86.9 శాతం నమోదయిందని కలెక్టర్ తెలిపారు.  
     ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సరూర్ నగర్ లోని విక్టోరియా మోమోరియల్ హై స్కూల్, హయత్ నగర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్, రాజేందర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరీష్. 

జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా జరిగిందని, ఏలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా పూర్తి స్థాయి బందోబస్తు మధ్య పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని కలెక్టరు పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు ఈ నెల 16న సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో ఉదయం 8 గంటలకు ప్రారంభమవుతుందని కలెక్టర్ తెలిపారు.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

జనరల్

ఒక్క హైదరాబాద్‌లో ఓట్లకు SIR షాక్!40 లక్షల ఓట్లు ‘అవుట్’!?ఓటర్ల జాబితాపై భారీ కత్తెర? నగరంలో తీవ్ర కలకలం.. తుది జాబితాపై ఉత్కంఠ

హైదరాబాద్, తెలంగాణ వార్త: sir సర్వేలు ఒక్క హైదరాబాద్లోనే 40 లక్షల ఓట్లు అవుట్? హైదరాబాద్...

జనరల్

జైపాల్ రెడ్డి కొనియాడిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్..

గొప్ప దార్శనికుడు.. జైపాల్ రెడ్డి తెలంగాణ సాధనలో ఆయన కృషి వెలకట్టలేనిది. ఆయన సేవలు,ఆయన మార్గం...

జనరల్

పట్టు చేనేత సహకార సంఘం ఎన్నికల్లో యూత్ గెలుపు..

. తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పట్టణ ప్రాంతంలో పట్టు చేనేత సహకార సంఘం లో...

You cannot copy content of this page