హైదరాబాద్ (తెలంగాణ వార్త) సోమవారం జిల్లాలో జరిగిన మహబూబ్ నగర్ – రంగారెడ్డి - హైదరాబాద్ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో 86.9 శాతం పోలింగ్ నమోదయిందని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టరు హరీష్ తెలిపారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమయిన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు పోలింగ్ ముగిసిందని కలెక్టర్ తెలిపారు. ఉదయం 10 గంటల వరకు 15.2 శాతం పోలింగ్ నమోదయిందని, 12 గంటల వరకు 43.8 శాతం పోలింగ్ నమోదయిందని, మధ్యాహ్నం 2 గంటలు 65.5 శాతం పోలింగ్ నమోదయిందని, సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ పూర్తయి 86.9 శాతం నమోదయిందని కలెక్టర్ తెలిపారు.
ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్న సరూర్ నగర్ లోని విక్టోరియా మోమోరియల్ హై స్కూల్, హయత్ నగర్ లోని జిల్లా పరిషత్ హై స్కూల్, రాజేందర్ నగర్ లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల పోలింగ్ కేంద్రాలకు వెళ్ళి పోలింగ్ జరుగుతున్న తీరును పరిశీలించిన జిల్లా కలెక్టర్ హరీష్.
Leave a comment