హైదరాబాద్ (తెలంగాణ వార్త) హైదరాబాద్ ,ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు జరుగుతున్న ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల పర్యవేక్షణలో భాగంగా బిజెపి అభ్యర్థి శ్రీ. ఏవిఎన్ రెడ్డి గారికి మద్దతుగా శేరిలింగంపల్లి జిల్లా ప్రజా పరిషత్ హై స్కూల్ దగ్గర పోలింగ్ కేంద్రం సందర్శించి, ఎన్నికల సరళిని పరిశీలించిన బీజేపీ రాష్ట్ర నాయకులు రవికుమార్ యాదవ్ గారు, గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ రాఘవేంద్ర రావు గారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ సమస్యల పరిస్కారానికై ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి ,హైదరాబాద్ జిల్లాల ఉపాధ్యాయ సంఘాలు ,బిజెపి బలపరిచిన అభ్యర్థి శ్రీ. ఏ.వి.ఎన్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాల్సింది కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి డివిజన్ బీజేపీ కంటెస్టెడ్ కార్పొరేటర్ కంచర్ల ఎల్లేష్,గచ్చిబౌలి డివిజన్ అధ్యక్షులు కృష్ణ ముదిరాజ్,చందా నగర్ డివిజన్ అధ్యక్షులు రామ్ రెడ్డి,హఫీజ్ పేట్ డివిజన్ అధ్యక్షులు శ్రీధర్ గౌడ్, లింగంపల్లి డివిజన్ అధ్యక్షులు రాజు శెట్టి, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మూల అనిల్ గౌడ్,రంగారెడ్డి జిల్లా అర్బన్ గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,దయాకర్, వసంత్ కుమార్ యాదవ్, ఆకుల లక్ష్మణ్ , సంజీవ, ప్రసాద్, చంద్ర మోహన్, లలిత, రాకేష్ దుబే, అంబటి అశోక్,రాజు,డివిజన్ నాయకులు,కార్యకర్తలు స్థానిక నేతలు,తదితరులు పాల్గొన్నారు.
Leave a comment