ఆర్మూర్ తెలంగాణ వార్త: ఆర్మూర్ పట్టణంలోని కమల నెహ్రూ కాలనీ శివారు ఎసిపి కార్యాలయం ఎదురుగా ఉన్న ఆఫీసర్స్ క్లబ్ లో పేకాట స్థావరంపై టాస్క్ఫోర్స్ పోలీసులు గురువారం సాయంత్రం రైడ్ చేశారు.ఇందులో పేకాట ఆడుతున్న ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు.వారి వద్ద నుండి 2,58000/- నగదు, 7 సెల్ ఫోన్లు, 3 కార్లను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాస్థాయి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పక్కా సమాచారంతో దాడులు నిర్వహించినట్లు తెలిసింది. ఆర్మూర్ పోలీసుల సహకారంతో టాస్క్ఫోర్స్ సభ్యులు దాడుల్లో పాల్గొన్నారు. ఆర్మూర్ పట్టణంలో పేకాట స్థావరాలపై దాడులు జరగడం చర్చనీయాంశంగా మారింది. ఏసీపీ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న క్లబ్ లో పేకాట జరగడం గమనార్హం.
Leave a comment