నిజామాబాద్, తెలంగాణ వార్త: నగరంలో 6వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్సపల్లి శివారులోని లక్కీ డ్రా స్కీం నిర్వహిస్తున్న నిర్వాహకులపై నిజామాబాద్ నార్త్ రూరల్ సిఐ జగడం నరేష్ ఆధ్వర్యంలో దాడి నిర్వహించారు. శనివారం అందిన సమాచారం మేరకు బోధన్ రోడ్డులోని తాజ్ దాబా సమీపంలో లక్కీ డ్రా జరుగుతుందన్న సమాచారం మేరకు నార్త్ రూరల్ సిఐ, 6వ టౌన్ ఎస్సై ఆంజనేయులు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నగరంలోని సూపర్ టైం ఎంటర్ ప్రైజెస్ ఆధ్వర్యంలో 3 వేల మంది సభ్యులకు సంబంధించిన లక్కీ డ్రా నిర్వహిస్తుండగా దాడి చేశారు. షేక్ అసీఫ్, సయ్యాద్ ముజాహిద్, సయ్యద్ ముజాహిద్ నోమాన్ అనే వ్యక్తులను రెడ్ హ్యాండెడ్ గా
Leave a comment