ఆర్మూర్, తెలంగాణ వార్త:: శ్రీ భాషిత పాఠశాలలో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదిన సందర్భంగా స్వయంపాలక దినోత్సవం (సెల్ఫ్ గవర్నింగ్ డే) గురువారం రోజు నిర్వహించారు. ఇందులో భాగంగా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించారు.
దీనిలో భాగంగా 10వ తరగతికి చెందిన విద్యార్థులు ఒకరోజు ఉపాధ్యాయులుగా మారి వారు తరగతులు నిర్వహించారు.అంతేకాకుండా ఉపాధ్యాయులు రోజు విద్యార్థులు కోసం ఎంత తపన పడుతుందో మాకు అర్థమైందని విద్యార్థులు వివరించారు.
మధ్యాహ్నం సమయంలో అలీ టవర్స్ పెర్కిట్ లో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ శ్రీ పోలపల్లి సుందర్ గారు ఉపాధ్యాయుల కోసం ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో శ్రీ భాషిత పాఠశాల డైరెక్టర్ పోలపల్లి సుమాలిని గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. ఇందులో భాగంగా ఉపాధ్యాయులు వారి చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుని వారిలో జరిగిన అభివృద్ధి గురించి ఒక్కొక్కరుగా మాట్లాడడం జరిగింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలని చెప్పారు అంతేకాకుండా పాఠశాల కరస్పాండెంట్ పోలపల్లి సుందర్ గారు మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి అనేది అవకాశం లాగా వచ్చిన కాని దాన్ని సద్వినియోగపరచుకోవాలి అని చెప్పారు.శ్రీ భాషిత పాఠశాల లో పనిచేసే ఉపాధ్యాయులందరూ కూడా నా కుటుంబ సభ్యులతో సమానంగా స్వీకరిస్తాను. నా పాఠశాల అభివృద్ధికి తోడ్పడుతున్న ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు అందరికీ నా వంతు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అని కొనియాడారు. అనంతరం ప్రతి ఒక్క ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయులందరూ ఆటపాటలతో అలరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్, కరస్పాండెంట్ ప్రిన్సిపల్, అసిస్టెంట్ ప్రిన్సిపల్, కోర్ కమిటీ మెంబర్ మరియు ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.
Leave a comment