తెలంగాణ వార్త:: రాష్ట్ర ప్రభుత్వం I&PR మరియు మీడియా అకాడమీ అధ్యర్యంలో మరణించిన 38 జర్నలిస్ట్ కుటుంబలకు లక్ష రూపాయల చొప్పున అలాగే శాస్ర చికిత్స చేయించుకున్న నలుగురు జర్నలిస్టులకు 50వేల చొప్పున సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీ వాసిరెడ్డి, పొన్నం ప్రభాకర్, మీడియా అకాడమీ చైర్మన్, ఐజేయు జాతీయ అధ్యక్షులు కే శ్రీనివాస్ రెడ్డి గార్ల చేతుల మీదుగా చెక్కులను పంపిణీ చేశారు.
ఆదివారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరిగిన ఈ కార్యక్రమంలో నిజామాబాద్ జిల్లాకు చెందిన జర్నలిస్టు కోటగిరి గంగాధర్ సతీమణి స్వరూప, నిజామాబాద్ నగరానికి చెందిన రామ్మోహన్ చారి సతీమణి మంజుల, ఇద్దరికీ లక్ష రూపాయలు చొప్పున చెక్కులను అందజేశారు. అలాగే శాస్త్ర చికిత్సలు చేయించుకున్న కబురు శ్రీనివాస్, నమస్తే తెలంగాణ డెస్క్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కూతురు (మానస) కు 50,000 చొప్పున చెక్కులను అందజేశారు. ఈ సందర్బంగా సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు నెలకు 3000 చొప్పున పెన్షన్ అలాగే వాళ్ళ పిల్లలు పదవ తరగతి చదువుకునే కొరకు నెలకు 1000 రూపాయలు విద్యాభృతి చెల్లించడం హర్షించదగ్గ విషయం.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న కుటుంబాలతో జర్నలిస్టుల కుటుంబాలతో పాల్గొన్న TUWJ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు ఎడ్ల సంజీవ్, ప్రధాన కార్యదర్శి అరవింద్ బాలాజీ, జిల్లా కోశాధికారి సిరిగాద ప్రసాద్ ప్రభుత్వానికి మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి కి, TUWJ రాష్ట్ర అధ్యక్షుడు విరహత్ అలీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ నారాయణ కు కృతజ్ఞతలు తెలిపారు.
Leave a comment