ఆర్మూర్( తెలంగాణ వార్త) ఇక ఆట మొదలైంది..వేటాడుతా
-అంతం కాదిది ఆరంభంమా జోలికొస్తే దంచి కొట్టుడే
-మా 60 లక్షల సైన్యం ఉఫ్ మంటే కొట్టుకుపోతారు
-ఆ నలుగురు దుష్ట చతుష్టయం
-రేవంత్ రెడ్డి నోట్లో పురుగులు పడి పోతాడు
-మా జిల్లా నేతలు వ్యక్తులు కాదు శక్తులు
-కేసీఆర్ బర్త్ డే వేడుక బ్లాక్ బస్టర్ హిట్
-నిజామాబాద్ సభలో జీవన్ రెడ్డి సింహ గర్జన
-అఖండ స్వాగతం పలికిన టీఆర్ఎస్ శ్రేణులు
నిజామాబాద్, ఫిబ్రవరి17:-
“ఇక ఆట మొదలైంది..వేటాడుతాం. వెంటాడుతా.అంతం కాదిది ఆరంభం.మా కేసీఆర్, కేటీఆర్, కవితక్క, మంత్రి ప్రశాంత్ రెడ్డి,మా ఎమ్మెల్యేల జోలికొస్తే దంచి కొట్టుడే. మా 60 లక్షల గులాబీ సైన్యం ఉఫ్ మంటే కొట్టుకుపోతారు. బండి సంజయ్, కిషన్ రెడ్డి, అరవింద్, రేవంత్ రెడ్డి లు తెలంగాణ ప్రజల పాలిట దుష్ట చతుష్టయం.
-ఆ నలుగురు దుష్ట చతుష్టయం. కేసీఆర్ బర్త్ డే వేడుకలపై పిచ్చికూతలు కూసిన రేవంత్ రెడ్డి నోట్లో పురుగులు పడి పోతాడు.బట్టేబాజ్, బక్వాస్, బడా జూటా ఫేక్, ఫ్రాడ్,ఫాల్స్ ఎంపీ. అరవింద్ ను జిల్లా నుంచి తరిమి కొడతం. నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ నేతలు వ్యక్తులు కాదు శక్తులు. కేసీఆర్ బర్త్ డే వేడుక బ్లాక్ బస్టర్ హిట్. కేసీఆర్ పూర్ణాయుష్షు తో ప్రధాన మంత్రిగా ఈ దేశాన్ని పాలించాలి” అని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు, పీయూసీ ఛైర్మన్ ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి సింహ గర్జన చేశారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మ దినోత్సవాన్ని పురస్కరించుకుని
నిజామాబాద్ జిల్లాలో మూడు రోజుల పాటు ఘనంగా వేడుకలు జరిగాయి. ఈ సందర్భంగా నిజామాబాద్ నగరంలో గురువారం కలెక్టర్ గ్రౌండ్ లో పార్టీ కొత్త అధ్యక్షుడు జీవన్ రెడ్డి నేతృత్వంలో వేలాది మంది టీఆర్ఎస్ శ్రేణులు, సబ్బండ వర్గాల ప్రజల మధ్య కేసీఆర్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.68 కిలోల కేక్ కట్ చేసి కేసీఆర్ కు ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. ఆయన ఆయురారోగ్యాలతో ఉండి దేశ ప్రధాన మంత్రి కావాలని ఆకాక్షించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ, కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. “హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్ లలో ఎందరో హీరోలు ఉండవచ్చు.కానీ ఒకే ఒక్కడు కేసీఆర్. తెలంగాణ “వార్” హీరో. నాలుగున్నర కోట్ల మంది తెలంగాణ ప్రజలు ఆయన అభిమానులే. రైతు బంధు తీసుకుంటున్న 64లక్షల మంది రైతు కుటుంబాలు, దళిత బంధు లబ్ది దారులు, లక్షలాదిమంది పెన్షన్ దారులు , కల్యాణ లక్ష్మీ ,షాదీ ముబారక్, కేసీఆర్ కిట్ లబ్దిదారులైన అక్కచెల్లెళ్ళు మా దేవుడు కేసీఆర్ పది కాలాలు చల్లగా ఉండాలని ప్రార్ధిస్తూ మూడు రోజుల పాటు కేసీఆర్ పుట్టిన రోజుల పాటు వేడుకలు జరుపుకుంటే మీ కెందుకు కడుపు మంట. గాంధీ భవన్ గాడ్సే రేవంత్ రెడ్డి కడుపు మండుతుంది. ప్రజలు నిన్ను చెప్పులతో కొడతారు. తూ అని ఉమ్మేస్తారు అని జీవన్ రెడ్డి నిప్పులు చెరిగారు. నిజామాబాద్ గడ్డ కేసీఆర్ అడ్డా. కేసీఆర్ ప్రధాన మంత్రి కావడాన్ని ఎవరూ ఆపలేరు అని ఆయన వెలుగెత్తి చాటారు. నిజామాబాద్ జిల్లా అంటేనే గులాబీ తోట అని ,ఇక్కడ పిచ్చి పువ్వులకు చోటు లేదన్నారు. మన జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సీఎం కేసీఆర్ అత్యంత సన్నిహితుడైన పెద్ద మంత్రి అని ,మన జిల్లా ఎమ్మెల్యేలు టైగర్లని జీవన్ రెడ్డి కొనియాడారు.
ఈ కార్యక్రమంలో
జిల్లా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,జిల్లా ఎమ్మెల్యేలు బిగాల గణేష్ గుప్తా,బాజిరెడ్డి గోవర్ధన్,షకీల్,ఎమ్మెల్సీలు విజి గౌడ్,రాజేశ్వర్ రావు,
జిల్లా గంథాలయ ఛైర్మన్ ఎల్ ఎంబీ రాజేశ్వర్,
మహిళా కార్పోరేషన్ ఛైర్మన్ ఆకుల లలిత, జిల్లా జడ్పి ఛైర్మన్ దాదన్నగారి విఠల్ రావు, మార్క్ ఫెడ్ ఛైర్మన్ మార గంగారెడ్డి, డిసిసిబి ఛైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లు పాల్గొన్నారు. ఇంకా
జడ్పీటీసీ సభ్యులు, మండల పరిషత్ అధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కార్పొరేటర్లు, కౌనిసిలర్లు, వార్డు సభ్యులు, అన్ని గ్రామాల సర్పంచ్ లు, పార్టీ మండల, గ్రామ శాఖ ల అధ్యక్షులు కూడా పెద్ద ఎత్తున పాల్గొని నిజామాబాద్ జిల్లా టీఆర్ఎస్ కంచు కోట అని చాటారు.
కొత్త అధ్యక్షుడు జీవన్ రెడ్డి కి అఖండ స్వాగతం
జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు గా నియమితులైన తరువాత తొలిసారిగా జిల్లాకు వచ్చిన జీవన్ రెడ్డి కి పార్టీ శ్రేణులు అఖండ స్వాగతం పలికారు. వేలాది కార్లతో కనీవినీ ఎరుగని రీతిలో గులాబీ దండు కదిలింది. టైగర్ జీవనన్న నాయకత్వం వర్ధిల్లాలి అని కార్యకర్తల నినాదాలతో నిజామాబాద్ నగరం మారుమోగింది. నగరమంతా జెండాలు,బ్యానర్లతో గులాబీ మయమైంది.
Leave a comment