హైదరాబాద్ (తెలంగాణ వార్త) తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలు జరుపుకోవడానికి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర రావు తెలంగాణలో సర్వే చేయించగా 25 సీట్లు రానున్నట్టు అత్యంత విశ్వాస నియంగా సర్వే వల్ల తెలిసింది. 3 ,4 జిల్లాలో పూర్తిగా తెలంగాణ ఎమ్మెల్యేలు ఓడిపోయే అవకాశం ఉన్నట్టు తెలిసింది. అర్థంకాని పరిస్థితిలో సీఎం కేసీఆర్ బీహార్ నుంచి ప్రశాంత్ కిషోర్ అలియాస్ పీకే ని పిలిపించుకున్నాడు. సంవత్సరానికి 500 కోట్లు ఇచ్చి తమ పార్టీని ఎలాగైనా గట్టెక్కించాలని పీకే నీ సీఎం కేసీఆర్ కోరారు. దానికి పీకే బుధవారం నుంచి తెలంగాణ రాష్ట్రంలో సర్వే మొదలుపెట్టాడు సర్వేలో టీఆర్ఎస్ పార్టీకి కనీసం 20 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేనట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీంతో సీఎం కెసిఆర్ ఖంగు తిని పీకే చెప్పిన విధంగా నడుచుకుంటానని చెప్పడంతో పీకే రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు 50 శాతం పాత ఎమ్మెల్యేలకు టికెట్టు ఇవ్వరాదని చెప్పినట్టు తెలిసింది 4 జిల్లాలో మొత్తం టీఆర్ఎస్ తుడుచుకో పోయె టట్టు ఉందని ప్రశాంత్ కిషోర్ సర్వేలో వెల్లడించారు. అయితే తెలంగాణ ఎమ్మెల్యేలకు ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అంటే భయం మొదలైంది. ఎవరికి టికెట్ ఇస్తారు ఎవ్వరో తెలియని అయోమయ పరిస్థితిలో ఎమ్మెల్యేలు భయంతో విలేకరులను సంప్రదించి ఏమైనా సమాచారం ఉంటే కాస్త చెప్పమని ప్రాధేయ పడుతున్నారని తెలిసింది. ప్రశాంత్ కిషోర్ ఎవరికి ఎమ్మెల్యే సీట్లు ఇప్పిస్తాడో వేచి చూడాల్సిందే. అయినా రోజురోజుకు రిపోర్టు లు వస్తూ ఉంటాయని తెలిసింది. ఇప్పుడు కేసీఆర్ ని నమ్ముకోవడం కంటే ప్రశాంత్ కిషోర్ ను నమ్మడం 100% నిజం. ప్రశాంత్ కిషోర్ ఇప్పటివరకు నాలుగు రాష్ట్రాల్లో గెలిపించిన సంగతి విధితమే.
Leave a comment