తెలంగాణ వార్త నందిపేట్ :ఆర్మూర్ నియోజక వర్గం లోని నందిపేట్ గ్రామంలో గురువారం ఉదయం ఎలక్ట్రిక్ స్కూటీపై టిఫిన్ కోసం వచ్చి బండి పార్క్ చేసి టిఫిన్ చేస్తూ ఉండగా, పక్కన పెట్టిన ఎలక్ట్రిక్ స్కూటీ మంట ల తో ఒక్కసారి శబ్దం వచ్చింది. స్కూటీ అక్కడికక్కడే బూడిద పాలయింది అక్కడ ఉన్న స్థానికులు మంటలు ఆర్పడానికి ప్రయత్నం చేసిన మంటలను ఆపలేకపోయారు. పెట్రోల్ ధరలు ఆకాశాన్నంటడంతో ప్రజలు ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టారు. అయితే ఎలక్ట్రిక్ వాహనాలు చాలాచోట్ల కాలిపోయినట్టు మనకు తెలిసిందే. ఎండ తీవ్రత తక్కువగా ఉన్నా ఇప్పుడే ఎలక్ట్రిక్ వెహికల్ కాలడం చర్చాంశామైంది. ఒకవేళ ఎలక్ట్రిక్ వెహికల్ పై అతడు కూర్చుని ఉంటే అతడు కూడా కాలిపోయే ఉండేవాడు అని స్థానికులు తెలుపుతున్నారు.
Leave a comment