ఆర్మూర్ తెలంగాణ వార్త: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని పెర్కిట్ గ్రామంలో చైన్స్ స్నాచింగ్ శుక్రవారం ఉదయం జరిగింది. మూడు తులాల మంగళసూత్రాన్ని గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి వెనుకనుండి మంగళసూత్రాన్ని తెంచుకుని వెళ్లారు. బీడీలు తీసుకొని పసుపుల అనసూయ అనే మహిళ బీడీ కార్ఖానా వెళ్లే సమయంలో దారిలో అనుకోకుండా వెనక నుండి మంగళసూత్రాన్ని లాగడంతో ఆ మహిళ అక్కడే పడిపోయింది. వెనక నుండి లాగడం వల్ల గొంతు కోసుకుపోయి ఆమె అక్కడ పడిపోయింది. తిరిగి చూస్తే వెనకాల బైక్ పై ఇద్దరు వ్యక్తులు వెళ్లారని ఆమె చెబుతుంది అయితే సీసీ ఫుటేజ్ కోసం తెలంగాణ వార్త ఎస్ ఐ సల్ల శ్రీకాంత్ ని కావాలని కోరగా తాము సీసీ ఫుటేజ్ ఇస్తే ఎంక్వైరీ ప్రాబ్లం అవుతుందని అందుకే ఎవరికి ఇవ్వలేమని తెలిపారు. తదనంతరం చూస్తే వేరే ఛానళ్లలో సి సి ఫుటేజ్ ఆధారంగా వార్తలు కనిపిస్తున్నాయి. అంటే కొందరు చుట్టాల కె సి. సి ఫుటేజీ లు ఇస్తున్నారా అన్న సందేహం ఏర్పడుతుంది.
Leave a comment