పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన తాసిల్దార్ తన కార్యాలయంలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని నీ వేధింపులకు గురి చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. రాత్రి వేళల్లో ఫోన్ చేసి పెండింగ్ పనులు పూర్తి అయ్యాయని ఆమెతో ఫోన్ లో రాత్రి వేళల్లో మాట్లాడుతూ వేధిస్తున్నట్లు బాధితురాలు ఫిర్యాదు చేయడంతో వెలుగు చూసింది. .యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల తాసిల్దార్ దయాకర్ రెడ్డి ఓ మహిళా ఉద్యోగిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు. గత నాలుగు నెలలుగా ప్రతిరోజు రాత్రిపూట ఫోన్ చేసి వేధింపులకు గురిచేశాడు. విసుగు చెందిన ఆమె చివరకు కలెక్టర్కు ఫిర్యాదు చేసింది .విచారణలో తాసిల్దార్ వేధింపులు నిజమేనని తేలడంతో అతడిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంది. విచారణ అధికారులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన కలెక్టర్ పమేలా సత్పతి తాసిల్దార్ దయాకర్ రెడ్డి ని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
Leave a comment