SaveHyderabad
It is an Emergency time for all of us.
111 G.O. ఎత్తేసిన కేసీఆర్.
ప్రాణాలు అడ్డు పెట్టయినా 111 G.O. ఎత్తివేతను అడ్డుకోవాలి….
111 G. O. పరిధిలో లక్ష ఎకరాలకు పైగా భూమి
ఉంది.ముందు చూపుతో భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని 1996 లోనే అప్పటి ప్రభుత్వం ఈ 111 G.O. ని తీసుకువచ్చారు.
హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ హైదరాబాద్ కి గుండె కాయలా ఉండి భాగ్య నగర వాసులు దాహం తీర్చే మంచి నీటి వనరులుగా ఉండేవి.ఈ రెండు చెరువులు మోయినా బాద్, శంకర్ పల్లి, చేవెళ్ల పరిసర ప్రాంతాలు.ఆ రెండు చెరువులు కలుషితం కాకూడదు అని దాని చుట్టూ 10 కిలో మీటర్ల మేర ఎలాంటి ఇండస్ట్రీలు, పెద్ద పెద్ద భవంతులు, కాలుష్యం వెదజల్లే ప్రాజెక్టులు రాకూడదని ఈ G.O. తీసుకువచ్చారు.
అక్కడ అనేక GREEN ZONEs ఉండటం వల్ల ఆ ప్రాంతంలో దట్టమైన వృక్ష సంపద ఉండి ప్రకృతి సౌందర్యంతో పాటు, మనం వెదజల్లే హైదరాబాద్ కాలుష్యాన్ని కూడా తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతున్నయి….
ఇప్పుడు మూర్ఖుడు కేసీఆర్ డబ్బుల మూటలకు కకృతి పడి 111 G.O. ఎత్తేస్తే అక్కడ ధరలు పదింతలు పెరుగుతయి, విచ్చల విడి కట్టడాలు, కాలుష్యం చిమ్మే ఫ్యాక్టరీలు కుప్పలు కుప్పలుగా పుట్టుకొస్తయి.కేసీఆర్ ముందుగా తన బినామీలతో అక్కడ భూములు కొనిపించి,రియల్ ఎస్టేట్ వ్యాపారుల దగ్గర వేల కోట్ల మామూళ్లు తీసుకుని హైదరాబాద్ ని కాలుష్యం కోరల్లో నెట్టేందుకు ఎత్తులు వేస్తున్నడు.
గోదావరి నీళ్లు తీసుకోచ్చాం ఇప్పుడు ఈ సరస్సుల అవసరం లేదు అనేది బొంకు, వర్షాలు సరిగా లేకపోతె గోదావరిలొనే నీళ్లు లేని కాలం వస్తే గోదారి నీళ్లు ఎలా తీసుకువస్తాడు???
కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు.
ఒకసారి మీరు అందరూ ఆలోసించుకొండే…
Leave a comment